నీతోనే ప్రేమ.. నీవే నా సర్వస్వం అంటూ తిరిగాడు. చివరాఖరికి పెళ్లి మాటెత్తితే ముఖం చాటేశాడు. ఓ ప్రేమికుడి మోసానికి బలయిన యువతి అతని ఇంటిముందే నిరసనకు దిగింది. రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చిట్యాల గ్రామంలో ప్రియుడి ఇంటిముందు బైఠాయించింది ఆ యువతి.
యువతితో నిశ్చితార్థం చేసుకొని మరో యువతిని ప్రేమ పెళ్ళి చేసుకున్నాడు శ్రీకాంత్ అనే యువకుడు. న్యాయం చేయాలంటూ యవకుడి ఇంటిముందు నిరసన తెలుపుతోంది యువతి. ప్రేమ పేరుతో తనను శారీరకంగా వాడుకొని పెళ్ళి చేసుకుంటానని మాటిచ్చాడని, చివరికి మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని యువతి వాపోతోంది.
తనను మోసగించిన యువకుడిపై చర్యలు తీసుకోవాలని యువతి డిమాండ్ చేస్తోంది. రెండు వారాల క్రితం అతనికి మరో యువతితో పెళ్లయింది. యువతి ఆందోళనతో పోలిసు స్టేషన్ ను ఆశ్రయించాడు యువకుడు.