బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా వస్తున్న చిత్రం కిష్కింధపురి. కౌశిక్ పెగల్లపాటి దర్శకుడు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లం కొండ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ నెల 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు బెల్లం బాబు.
Also Read : Exclusive : బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కిందపురి’ ప్రీమియర్ టాక్..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో బెల్లం కొండా మాట్లాడుతూ ‘ సినిమా అంటే రెండున్నర గంటలు ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చేయడం. థియేటర్ లో కూర్చున్నపుడు ప్రేక్షకుడు బోర్ ఫిల్ అయి మొబైల్ చూడకుంటే ఆ సినిమా హిట్. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్న కిష్కిందపురి సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాల తర్వాత ఆడియెన్స్ ఫోన్ చూడరు. ఒకవేళ అలా ఎవరైనా చూస్తే నేను అసలు ఇంకా సినిమాలు చేయను ఇండస్ట్రీ వదిలి వెళ్తాను. ఈ సినిమా అంత బాగుంటుంది. ఇది నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఈ సినిమా కథపై నమ్మకంతో చెప్తున్న. కథ పరంగా, సౌండింగ్ పరంగా ఈ సినిమా చాలా బాగుంటుంది. ఆ నమ్మకంతో చెప్తున్న కిష్కింధపురి మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటుంది’ అని అన్నారు. బెల్లం కొండా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి బెల్లం స్టార్ మాటలు ఎంతవరకు నిజమవుతాయో రెండు రోజుల్లో తెలుస్తుంది.