మహబూబాబాద్ జిల్లాలో పోడు భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మోడీ వరంగల్ ప్రజలకు క్షమాపన చెప్పిన తరువాతే ఈ జిల్లాకు రావాలి అని అన్నారు. మరో పదిరోజుల్లో నరేంద్ర మోడీ వరంగల్ కు వస్తున్నారు.. నరేంద్ర మోడీని మా వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజల తరుపున అడుగుతున్నాను అని కేటీఆర్ అన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వడం లేదు.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతాం అన్నారు.. ఎందుకు ఉక్కు పరిశ్రమ పెట్టడం లేదు..
వరంగల్ కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడుతా అన్నావ్.. మాట రైళ్లు తయారీ కేంద్రం ఇప్పుడు మెకానిక్ ఫాక్టరీ పెడతా అంటున్నారు అని కేటీఆర్ అన్నారు.
Read Also: Karnataka High Court: ట్విట్టర్‌కు కర్ణాటక హైకోర్టు షాక్.. రూ.50 లక్షల జరిమానా
ముందుగా వరంగల్ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన ప్రధాని నరేంద్ర మోడీ క్షేమపణ చెప్పి వరంగల్ కు రావాలి అని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. పోడు రైతులకు పండుగ దినం.. 4లక్షల 6 వేల ఎకరాలు 1.50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. ఒక్క మహబూబాబాద్ జిల్లాలోనే 24, 972 మంది రైతులకు 70, 434 ఎకరాల భూమిని పంపిణీ చేస్తున్నామన్నారు. జల్ జంగల్ జమీన్ అనే కొమురం భీం నినాదంతో అన్ని తండాలకు మంచినీరు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Read Also: Nandini Rai Pics: టైట్‌ఫిట్ డ్రెస్‌లో నందిని రాయ్.. ఒంపుసొంపులు చూపిస్తూ రచ్చ చేసిన హాట్ బ్యూటీ!
బిందెలు, కుండలు పట్టుకుని ఆడపడుచులు రోడ్డు పైకి వచ్చే పరిస్థితి తెలంగాణలో లేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హరిత హారం పేరుతో చెట్ల పెంపకంతో పాటు ఇప్పుడు గిరిజనుల అభివృద్ధి కోసం పోడు పట్టాలు పంపిణీ చేసి భూమి కూడ ఇస్తున్నామన్నాడు. 6 శాతం ఉన్న గిరిజనులు, ఆదివాసీల రిజర్వేషన్ ను 10 శాతంకు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని కేటీఆర్ అన్నారు. పోడు భూములకు పట్టాలు పొందడంతో పాటు రైతు బంధు, రైతు భీమా పొందుతున్నారు.
జిల్లాల పునర్విభజన తరువాత మీకు పాలన అందుబాటులోకి వచ్చింది అని కేటీఆర్ తెలిపారు. 10 మంది డాక్టర్లు లేని మహబూబాబాద్ సర్కారు దవాఖానకు 110 మంది వైద్యులు వచ్చారు.. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మి మోసపోవద్దు.. ఆచరణ సాధ్యం కాని హామీలతో మీ ముందుకు వస్తున్నారు.. వారి మాటలు వింటే మీరు మోసపోతారు అని మంత్రి కేటీఆర్ అన్నారు.