Zomato Delivery Boy: పుట్టిన రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు. కొందరు తన కుటుంబ సభ్యులతో జరుపకుంటారు. మరికొందరు కుటుంబ సభ్యులు, మిత్రులు అందరితో కలిసి గ్రాండ్‌గా జరుపుకుంటారు. మరికొందరు గుడికి వెళ్లి వచ్చి తన పుట్టిన రోజును జరుపుకుంటారు. ఇంకొందరు పుట్టిన రోజును జరుపుకోకుండానే ఉంటారు. అయితే పుట్టిన రోజును జరుపుకునే వారు ఎక్కువ మందే ఉంటారు. అయితే పుట్టిన రోజు కూడా ఉద్యోగం చేయాల్సి వస్తే.. పుట్టిన రోజు నాడు ఆఫీసులో సెలవు దొరక్కపోతే ఎలా అని బాధ పడే వారికి ఇతను జరుపుకున్న బర్త్ డే లాగా చేసుకుంటే సరిపోతుంది.. అదెలా అంటే..
Read also: Revanth Reddy: భట్టి విక్రమార్కతో టీపీసీసీ చీఫ్ భేటీ.. ఖమ్మం సభపై చర్చ
ఫుడ్ డెలివరీ యాప్ అయిన జొమాటోలో పనిచేసే ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ ( డెలివరీ బాయ్) డ్యూటీలో ఉండే తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడు. అతను తన పుట్టిన రోజును జరుపుకున్న తీరు పలువురిని ఆకట్టుకుంటోంది. తన బర్త్ డే సందర్బంగా డెలివరీ బాయ్ డ్యూటీకి వచ్చే సమయంలోనే కొత్త షర్ట్ కొనుక్కున్నాడు. తరువాత తాను డ్యూటీలో జాయిన్ అయ్యాడు. డ్యూటీలో జాయిన్ అయిన తరువాత తాను పుడ్ డెలివరీ చేసిన కస్టమర్లందరికీ చాక్లెట్లు అందించి తన సంతోషాన్ని వారితో పంచుకున్నారు. వారు తనకు తెలియకపోయినా.. తన సంతోషాన్ని వారితో చాక్లెట్ ఇచ్చి పంచుకున్నాడు.
Read also: Spy: ‘స్పై’లో బన్నీ… ఎలివేషన్ మామూలుగా లేదుగా!
జుమాటో డెలివరీ బాయ్ కరణ్ ఆప్టే (30) తాను చేసుకున్న ఈ బర్త్ డే విధానాన్ని తన ఫేస్‌బుక్ పోస్ట్‌తో అందరికీ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు ఎఫ్బీలో వైరల్ అవుతోంది. కరణ్ పోస్ట్‌ను షేర్ చేస్తున్న పలువురు అతడు తన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పుట్టినరోజు నాడు ఎవరైనా గిఫ్ట్‌లు ఇస్తారేమోనని ఎదురుచూస్తుంటాం..కానీ కరణ్ ఆప్టే తన ప్రత్యేకమైన రోజును తనకు పరిచయం లేనివారికి సైతం చాక్లెట్లు పంపిణీ చేసి సెలబ్రేట్ చేసుకోవడం గొప్ప విషయమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. నా బర్త్ డే..నేను కొత్త షర్ట్ కొనుక్కొని ఆపై జొమాటోలో నేను డెలివర్ చేసిన ప్రతి ఆర్డర్‌కు చాక్లెట్లు ఇచ్చానని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. కొందరు యూజర్లు ఈ పోస్ట్‌ను జొమాటోకు ట్యాగ్ చేసి బర్త్‌డే బాయ్‌కు గిఫ్ట్ అందించాలని, బర్త్‌డే సెలబ్రేట్ చేయాలని కోరారు. జొమాటో డెలివరీ బాయ్ ఆలోచనకు హాట్సాప్ చెబుతున్నారు.