ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి: కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణు అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పిలునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, వివిధ విభాగాలకు చెందిన శాఖదిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సాధించేందుకు వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియ పైన దిశానిర్దేశం చేశారు. గతంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో సీఎం కేసీఆర్ మార్గదర్శకాలతో, ప్రభుత్వ శాఖాధిపతుల కృషితో గతంలో అగ్రస్థానంలో నిలిచామని కేటీఆర్ అన్నారు. ఈసారి ర్యాంకుల్లో సైతం అగ్రస్థానంలో నిలిచేలా కృషిచేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాల్లో 100% సంస్కరణలు, చర్యలు పూర్తయ్యాయని పరిశ్రమల శాఖ అధికారులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. ఈసారి రానున్న ర్యాంకులను నిర్దేశించే యూజర్ ఫీడ్‌బ్యాక్ అత్యంత కీలకమైన అంశమని, ఈ విషయంలో వివిధ శాఖలకు సంబంధించిన సేవలు పొందుతున్న పారిశ్రామిక వర్గాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుందని పరిశ్రమల శాఖ అధికారులు వివిధ శాఖల ఉన్నతాధికారులకు వివరించారు. రాష్ర్ట ప్రభుత్వ విధానాలు, ఇక్కడి అధికారుల చొరవతో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వస్తున్నాయన్నారు. తద్వారా ఇక్కడ అద్భుతమైన ఉపాధి అవకాశాలు మెరుగుపడుతున్నాయని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈసారి సైతం అగ్రస్థానం సాధించుకునేందుకు అందరూ కలిసి ప్రయత్నం చేయాలని కేటీఆర్ అన్నారు.
Also Read
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
- CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
Read Also: ఏపీలో కొత్తగా 4 ఒమిక్రాన్, 434 కోవిడ్ కేసులు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల కోసం పనిచేయడం కేవలం పరిశ్రమల శాఖ కోసం పని చేయడం మాత్రమే కాదని, తమ తమ శాఖలు విభాగాలను బలోపేతం చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం అని కేటీఆర్ అధికారులతో అన్నారు. తెలంగాణ ప్రజల కోసం పని చేస్తున్నామనే స్ఫూర్తితో పని చేస్తే ర్యాంకుల్లో మరోసారి అగ్ర స్థానం దక్కడం ఖాయమని ఈ దిశగా పని చేద్దామని మంత్రి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలకు సంబంధించిన 300కు పైగా సంస్కరణలు, చర్యలు పూర్తి అయ్యాయని మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించి ఆయా శాఖల వారీగా మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించి అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చారు.
తాజావార్తలు
-
Nag Ashwin : దుల్కర్ ‘ఐ యామ్ గేమ్’లో మైండ్ బ్లాంక్ అయ్యే సీక్రెట్ లీక్ చేసిన నాగ్ అశ్విన్!
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!