Kishan Reddy : హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రుల కేంద్రంగా ఖ్యాతికెక్కిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో 22వ ఎడిషన్ బయో ఆసియా-2025 లాంటి గ్లోబల్ ఈవెంట్స్ నగర వేదికగా జరగడం, హెల్త్‌కేర్ రంగంలోని సాంకేతికత, సుస్థిరమైన పద్ధతుల గురించి చర్చించడం ఎంతో ఆనందకరమని అన్నారు. బుధవారం బయో ఆసియా-2025 సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి, వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఆవిష్కర్తలకు పురస్కారాలు అందజేశారు.…
రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లో జరిగిన 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. కీలక రంగాలకు సంబంధించి జీఎస్టీ విధానంలో తేవాల్సిన మార్పు చేర్పులపై జీఎస్టీ కౌన్సిల్‌లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక సూచనలు చేశారు.
National Retail Trade Policy: దేశవ్యాప్తంగా ఉన్న చిల్లర వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త జాతీయ విధానాన్ని రూపొందిస్తోంది. ఇప్పటికే ఉన్న పాలసీలో పలు మార్పులు చేర్పులు చేయనుంది. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ జాతీయ రిటైల్ వాణిజ్య విధానాన్ని తీసుకురానుంది. దీంతో.. వర్తకులకు ఎంతో ప్రయోజనం కలగనుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, మరింత క్రెడిట్ పెరగనుంది. ఆన్‌లైన్ రిటైలర్లకు కూడా ఇ-కామర్స్ పాలసీని అందుబాటులోకి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ కృతనిశ్చయంతో ఉంది.
సరళతర వ్యాపార నిర్వహణ( ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో తెలంగాణ రాష్ట్రానికి అవార్డు లభించింది. మీసేవ పోర్టల్, వ్యాపార నిర్వహణలో అత్యుత్తమ విధానాలు అమలుచేస్తున్నందుకు ఈ పురస్కారం తెలంగాణను వరించింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మరోసారి నంబర్ వన్‌గా నిలిచింది.. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ స్పాట్‌లో నిలిచి సత్తా చాటింది.. ఈ జాబితాలో టాప్ ఎచీవర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించింది కేంద్రం.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో తెలంగాణు అగ్ర స్థానంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేయాలని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పిలునిచ్చారు. బుధవారం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, వివిధ విభాగాలకు చెందిన శాఖదిపతులతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని సాధించేందుకు వివిధ…