Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధంతో ప్రారంభమైన ఉద్రిక్తతలు.. చివరకు ఇరాన్ వర్సెస్ అమెరికాగా మారిపోయాయి.. ఇప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో టర్కీ నుంచి బ్రిటన్‌కు ప్రయాణించే సమయంలో రహస్యంగా విమానం మార్చినట్లు వెల్లడించారు. సీక్రెట్ సర్వీస్, అమెరికా సైన్యం ఇచ్చిన భద్రతా సూచనల మేరకు తాను మరో విమానంలో ప్రయాణించాల్సి వచ్చిందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ నుంచి తీవ్రమైన ముప్పు ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి.
టర్కీలోని అంకారాలో కెమెరాల సమక్షంలో ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఎక్కినప్పటికీ.. కొద్దిసేపటికే ఆయనను మరో చిన్న సైనిక విమానం C-32Aలోకి మార్చినట్లు సమాచారం. ఈ మార్పు జర్నలిస్టులకు తెలియకుండా అత్యంత రహస్యంగా చేపట్టారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్న విలేకరులను కిటికీలు మూసి ఉంచాలని సీక్రెట్ సర్వీస్ సూచించినట్లు నివేదికలు వెల్లడించాయి. అధ్యక్షుడిపై లేదా ఆయన ప్రయాణిస్తున్న విమానంపై దాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా సమాచారం కారణంగానే అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు అమెరికా మీడియా తెలిపింది. ఈ విషయంపై ట్రంప్ మాట్లాడుతూ తనకు తరచూ బెదిరింపులు వస్తుంటాయని, భద్రతా సిబ్బంది ఇచ్చే సూచనలను తాను పాటిస్తానని చెప్పారు.
Also Read
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
ఇరాన్‌ను తాను ఎందుకు నమ్మడం లేదనే విషయాన్ని కూడా ట్రంప్ ప్రస్తావించారు. ఇరాన్ పదేపదే అబద్ధాలు చెబుతోందని ఆరోపించిన ఆయన.. ఆ దేశాన్ని నమ్మే విషయంలో తాను చివరి వ్యక్తినని వ్యాఖ్యానించారు. తనకు ఉన్నత స్థాయి బెదిరింపులు వస్తుంటాయని, అయినప్పటికీ భద్రతా చర్యలను తేలికగా తీసుకోనని స్పష్టం చేశారు. ఈ ఘటనతో ట్రంప్ భద్రతకు సంబంధించిన చర్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌తో అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అధ్యక్షుడి ప్రయాణాల్లో భద్రతా వ్యవస్థలు ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయో ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
తాజావార్తలు
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!