ఏపీలో కొత్తగా 4 ఒమిక్రాన్, 434 కోవిడ్‌ కేసులు

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఆంక్షల దిశగా వెళ్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు ఆదివారం రోజున పూర్తి లాక్‌ డౌన్‌ను ప్రకటించింది. ఓవైపు కరోనా, మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తునే ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించిన ముప్పు తప్పదని ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కాగా తాజాగా ఏపీలోనూ మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Read Also: షాహినాయత్‌ గంజ్‌లో కల్తీ నెయ్యి పట్టివేత

అమెరికా నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, మరో దేశం నుంచి వచ్చిన ఒకరికి ఒమిక్రాన్ నిర్ధారణయింది. బాధితుల్లో ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు, గుంటూరు జిల్లాకు చెందిన ఒకరు ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరుకుంది. మరోవైపు ఏపీలో పెరుగుతోన్న కోవిడ్ కేసులు సైతం ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ రోజు కొత్తగా 434 కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల నుంచి పెరుగుతోన్న కేసుల వ్యాప్తి. నిన్న 334 కేసులు. నవంబర్ 10 తర్వాత నిన్న, ఇవాళ అత్యధిక కేసుల నమోదైనట్టు రాష్ర్ట వైద్యాధికారులు తెలిపారు.

Related Articles

Latest Articles