KTR : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి దోచుకుంటున్నారు
- కాంగ్రెస్-బీజేపీపై కేటీఆర్ ఫైర్
- కాంట్రాక్టులపై సంచలన ఆరోపణలు
- ‘ఆర్ఆర్ టాక్స్’పై ప్రశ్నలు
- చీకటి దోస్తీపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ , బీజేపీ పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఒకరి దోపిడీని మరొకరు బయటపెట్టకుండా పరస్పరం కాపాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాంట్రాక్టుల కేటాయింపులో ఈ రెండు పార్టీల మధ్య ఉన్న “ఇచ్చి-పుచ్చుకునే బంధం” స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డికి సింగరేణిలో వందల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘అమృత్’లో కూడా ఆయనకే భారీగా టెండర్లు దక్కేలా చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీజేపీ ఎంపీలకు కూడా కాంట్రాక్టులు ఇస్తున్నారని, ఇలా ఒకరికొకరు లబ్ధి చేకూర్చుకుంటూ దోపిడీని సాగిస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!
Also Read
- Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
- Adilabad RIMS Fire : రిమ్స్ విషాదం.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.!
- Food Safety : ఎక్స్పైరీ మసాలాలకు కొత్త తేదీలు.. దిల్ బహార్ యూనిట్‌పై ఎస్వోటీ దాడి
- Janasena Party: జనసేన తెలంగాణలో కొత్త కమిటీ.. జాయినింగ్ కమిటీ కన్వీనర్‌గా ప్రేమ్ కుమార్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో చేసిన ‘ఆర్ఆర్ టాక్స్’ (రాహుల్-రేవంత్ టాక్స్) వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణలో బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద ఈ టాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని స్వయంగా ఆరోపించి దాదాపు రెండేళ్లు కావస్తున్నా, ఇప్పటివరకు దానిపై ఎందుకు విచారణ జరిపించలేదని ఆయన నిలదీశారు. అవినీతి జరుగుతోందని తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మర్మమేమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ , బీజేపీలు కేవలం ప్రజల కళ్లముందు మాత్రమే కొట్లాడుకుంటున్నాయని, కానీ అంతర్గతంగా మాత్రం బ్రహ్మాండమైన దోస్తీని కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ఒకరి అవినీతిని మరొకరు దాచిపెడుతూ తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని, ఈ “చీకటి దోస్తుల” వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ హెచ్చరించారు.
Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!