Karimnagar : కరీంనగర్లో పొలిటికల్ హీట్.. నేతల అరెస్టులు, వరుస ఘటనలతో టెన్షన్.!
- రాజకీయ ఘర్షణలతో కరీంనగర్లో ఉద్రిక్తత
- గంగులపై వ్యాఖ్యలతో మరోసారి దుమారం
- బండారి వేణు, బీఆర్ఎస్ నేతల అదుపులోకి
- నగరంలో భారీగా పోలీసుల మోహరింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ ప్రస్తుతం పోలీసు శాఖకు తీవ్ర సవాల్‌గా మారుతోంది. గత నాలుగు నెలలుగా నగరంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఉద్రిక్త సంఘటనలు, రాజకీయ పార్టీల విభేదాలు, దొంగతనాలు , వివాదాలు స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన నుంచి మొదలుకొని, సంచలనం సృష్టించిన పీఎంజే జ్యువలరీ దోపిడీ వరకు వరుస నేరాలు పోలీసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య నెలకొన్న తీవ్ర రాజకీయ వైషమ్యాలు తరచూ వీధి ఘర్షణలకు దారితీస్తుండటంతో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటోంది.
మాజీ మంత్రి గంగులపై వ్యాఖ్యలతో దుమారం…
Also Read
తాజాగా మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను ఉద్దేశించి కార్పొరేటర్ బండారి వేణు చేసిన తీవ్ర వ్యాఖ్యలు నగరంలో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బండారి వేణు ఇంటిని ముట్టడించేందుకు బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా యత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి ముట్టడికి యత్నించిన బిఆర్ఎస్ నేతలతో పాటు, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కార్పొరేటర్ బండారి వేణును కూడా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బండారి వేణు ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఏసీపీ వెంకటస్వామి స్వయంగా పర్యవేక్షిస్తుండగా, వరుస ఉద్రిక్తతల దృష్ట్యా నగరంలో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?