KTR : ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
- ఏ వర్గం ప్రజలు కూడా ఈ ప్రభుత్వ పాలనపై సంతృప్తిగా లేరు
- ఎన్నికల ముందు హామీల జాతర.. ఎన్నికల తర్వాత చెప్పుల జాతర
- ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు దాటింది
- పదేళ్లపాటు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోయింది
- అసెంబ్లీ ఎన్నికల్లో ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోయాం. -కేటీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR : సిద్దిపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రెస్‌మీట్ నిర్వహించి పలు అంశాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని ఆశ్చర్యకరంగా పేర్కొన్న ఆయన, పార్టీ ఇచ్చిన 10 హామీల్లో 8 నెరవేర్చినా ప్రజలు విశ్వాసం చూపలేదని అన్నారు. కాంగ్రెస్ 22 నెలల పాలనలో ఎవ్వరూ సంతోషంగా లేరని, ముఖ్యంగా రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని విమర్శించారు. ఎన్నికల ముందు హామీల జాతర పెట్టిన కాంగ్రెస్, ఎన్నికల తర్వాత మాత్రం చెప్పుల జాతర మిగిల్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. “ఆనాటి రోజులు తిరిగి తెస్తానని రేవంత్ నిజమే చెప్పాడు… కానీ చెప్పి మరీ నిజాయితీగా మోసం చేశాడు” అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే వెనుకబడ్డామని అంగీకరించారు.
Also Read
కాళేశ్వరం ప్రాజెక్టు విషయమై కేటీఆర్ విపులంగా వివరించారు. గోదావరి జలాలు సమృద్ధిగా దొరికే మెడిగడ్డలో ఈ ప్రాజెక్టును నిర్మించామని, 21 పంప్ హౌస్‌లు, 19 సబ్స్టేషన్లు, 15 రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల సొరంగాలు, వేల కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలతో ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం నిలిచిందని అన్నారు. ఇలాంటి ప్రాజెక్టు కట్టినా కేసీఆర్‌పై సీబీఐ విచారణ పెట్టడం ఆశ్చర్యమని వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో కరోనా సమయంలో కూడా ఆదాయం సున్నా అయినా సంక్షేమ పథకాలు ఆగలేదని కేటీఆర్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ నాయకులు మాత్రం ఢిల్లీకి మూటలు మోయడమే పని చేసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం తెలంగాణ అప్పులు మూడు లక్షల కోట్లకు పైగా ఉన్నాయంటూ అబద్ధాలు చెబుతోందని, వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి సాధ్యమైందని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10, 11 తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నట్లు కేటీఆర్ తెలిపారు. తెలంగాణపై కేసీఆర్‌కి ఉన్న ప్రేమ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పటికీ ఉండదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలను “దండుపాళ్యం బ్యాచ్”గా అభివర్ణించిన ఆయన, “మన దగ్గర ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు” అని ఆరోపించారు.
తాజావార్తలు
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్‌నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!