Dharmana Prasada Rao : రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున రెడ్డిని దోషిగా ప్రచారం చేయడాన్ని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా ఖండించారు. రిమాండ్ లో ఉన్న వ్యక్తిని దోషిగా పరిగణించి. ఆరోపణలు చేయకూడదని హితవు పలికారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిధున్ రెడ్డిని ములాఖాత్ లో కలిసి వచ్చిన. ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడుతూ మిధున్ రెడ్డిని దోషిగా పోలీసులు అధికారులు, రాజకీయ నాయకులు నిర్ధారించకూడదని హితవు పలికారు. ప్రత్యర్థులు అందరినీ దోషులుగా చూపించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. మిథున్ రెడ్డికి బెయిల్ వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. మిథున్ రెడ్డికి రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు అరెస్టులు రాజకీయాల్లో సహజమేనని అన్నారు. బెయిల్ రాకుండా చేయడం కోసమే ఛార్జ్ షీట్ వేయట్లేదని విమర్శించారు.
CM Revanth Reddy : చేసిన పాపాలు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.. అవి ఎక్కడికీ పోవు
ములాఖాత్ కు వెళ్ళిన ఆలూరు ఎమ్మెల్యే బి విరుపాక్షి మీడియాతో మాట్లాడుతూ. చంద్రబాబును జైలుకు పంపామనే కక్షతోటే మిథున్ రెడ్డిని జైలుకు పంపారని వ్యాఖ్యానించారు. ఇది కక్షపూరిత చర్య. అంటూ. మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ తో తనకు ఏ విధమైన సంబంధం లేదని మిథున్ రెడ్డి చెప్పారని అన్నారు. జనసేన నాయకులు మహిళలపై దాడులకు పాల్పడుతున్న పట్టించుకోవడంలేదని అన్నారు. చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
Clinical Trials: కొత్త డ్రగ్స్, క్లినికల్ ట్రయల్ రూల్స్ 2019ని సవరించడానికి కేంద్రం సన్నాహాలు