Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం..
- పెళ్లి బృందం ఆటోను ఢీకొట్టిన లారీ..
- నలుగురు అక్కడికక్కడే మృతి. మరో 8 మందికి తీవ్ర గాయాలు..
- పెళ్లి ముహూర్తానికి ముందే విషాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kambham Road Accident: ప్రకాశం జిల్లా కంభంలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. పెళ్లి ముహూర్తానికి కొద్ది సేపటి ముందే పెళ్లి బృందంపైకి అదుపుతప్పిన లారీ దూసుకెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన అమరావతి–అనంతపురం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గిద్దలూరు పట్టణంలోని నల్లబండ బజార్‌కు చెందిన పెళ్లి బృందం కంభంలో జరగనున్న వివాహానికి హాజరైంది. ఉదయం 9:30 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా, అంతకుముందు స్థానిక వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించే కార్యక్రమం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు నిలబడి ఉన్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి నేరుగా వారిపైకి దూసుకెళ్లింది.
Also Read
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- CM Chandrababu Prakasam District Visit: నేడు ప్రకాశం జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
పెళ్లి బృందాన్ని ఢీకొట్టిన అనంతరం లారీ మరో మూడు ద్విచక్ర వాహనాలు, రెండు బడ్డీ బంకులను కూడా ఢీకొట్టడంతో అక్కడ తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రమాదంలో ఆవుల అలకనంద (19), ఆవుల అంకాలు (20), ఆవుల నగేష్ (17), ఏడాదిన్నర చిన్నారి ఆవుల నాగేశ్వరి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో పెళ్లికూతురు ఆవుల వీరక్క తీవ్రంగా గాయపడగా, మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం తీవ్రంగా గాయపడిన నలుగురిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మృతి చెందిన వారిలో పెళ్లికూతురి ఇద్దరు సొంత అన్నలు, వదిన, మేనకోడలు ఉండటం కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది. పెళ్లి వేడుక జరగాల్సిన ఇంట్లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదానికి లారీ మితిమీరిన వేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన కంభం పోలీసులు ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!