T20 World Cup 2026: సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
- సెమీస్‌లో ఇంగ్లండ్ ఘన విజయం
- దక్షిణాఫ్రికాపై 40 పరుగుల తేడాతో విజయం
- ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women’s T20 World Cup 2026 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాను అద్భుత ప్రదర్శనతో 40 పరుగుల తేడాతో ఓడించి.. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా.. హీథర్ నైట్ కీలక పరుగులు చేసింది. సెమీస్‌లో విజయం సాధించిన ఇంగ్లీష్ టీమ్.. ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో అమితుమీ తేల్చుకోనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో పడటంతో ఒత్తిడిలో పడింది. అయితే కెప్టెన్ నాట్ స్కివర్ బ్రంట్, హీథర్ నైట్ జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్‌ను బలమైన స్థితిలో నిలిపారు. బ్రంట్ 47 బంతుల్లో 75 పరుగులు చేసి మరోసారి తన క్లాస్‌ను చాటుకుంది. అద్భుత బౌండరీలు, భారీ సిక్సర్లతో పరుగులు చేసింది. మరోవైపు నైట్ 47 బంతుల్లో 58 పరుగులు చేసి కీలక సహకారం అందించింది. ఇద్దరి ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది.
Also Read
- IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
- Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
- Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్ టాజ్మిన్ బ్రిట్స్ ఒంటరి పోరాటం చేసింది. ఆమె 45 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టుకు విజయం అందించేందుకు ప్రయత్నించినా.. మరో ఎండ్‌లో సహకారం లేకపోయింది. ఇంగ్లండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా ప్రోటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 129 పరుగులకే పరిమితమైంది. దీంతో ఇంగ్లండ్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్‌ను మలుపుతిప్పిన కెప్టెన్ నాట్ స్కివర్-బ్రంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. క్లిష్ట పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఆడుతూ జట్టుకు భారీ స్కోరు అందించిన ఆమె ప్రదర్శన ఇంగ్లండ్ విజయానికి ప్రధాన కారణమైంది. ఈ విజయంతో ఇంగ్లండ్ మహిళల జట్టు మహిళల టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్‌కు అర్హత సాధించింది. టైటిల్ కోసం ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ప్రపంచ క్రికెట్లో అత్యంత బలమైన రెండు జట్ల మధ్య జరిగే ఈ ఫైనల్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. లార్డ్స్ మైదానంలో జులై 5న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
తాజావార్తలు
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
-
IND vs WI 4th T20: ఎన్నో మ్యాచ్‌లను గెలిపించాడు.. అతడు జట్టులో ఉండుంటే టీమిండియా గెలిచేది!
-
NSUI Protest: సీజేపీ ‘త్రివర్ణ యాత్ర’కు ముందు అర్ధరాత్రి ఢిల్లీలో హైవోల్టేజ్ డ్రామా..
-
Local Body Elections 2026: కుప్పం, చిత్తూరు మున్సిపల్ పీఠాలపై టీడీపీ కసరత్తు.. ఐవీఆర్ఎస్ సర్వేతో అభ్యర్థుల ఎంపిక!
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!