OTR: యాదాద్రి కమిటీ.. కాంగ్రెస్‌లో చిచ్చు రేపిందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుట్ట ఆలయ కమిటీ నియామకంతో గందరగోళం పెరిగిందా? ఇప్పటికే కాస్త అటు ఇటుగా ఉన్న వ్యవహారాన్ని సరిదిద్దాల్సిన నాయకుడే అగ్గికి ఆజ్యం పోశారా? అసలు యాదగిరిగుట్ట టెంపుల్ కమిటీని ఏ ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రకటించింది? దాని గురించి కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆజ్యం పోసిన ఆ కీలక నాయకుడు ఎవరు?
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ నియామకం కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. దానిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలక వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారాయన. ఆలయ కమిటీ వేస్తున్నప్పుడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు కనీస సమాచారం కూడా లేకపోవడం ఏంటన్నది ఆయన ప్రశ్న. తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఇది చర్చనీయాంశమైంది. అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా పర్యటనకు కూడా దూరంగా ఉన్నారు రాజగోపాల్‌రెడ్డి. ఆ మరుసటి రోజే యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ప్రకటన రావడంతో మునుగోడు ఎమ్మెల్యే బయట పడ్డట్టు తెలుస్తోంది. మంత్రి పదవి ఆశించి… దక్కలేదన్న అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఆ కారణంతోనే సీఎం సభకు రాలేదన్న ప్రచారం కూడా జరిగింది. ఇక యాదగిరిగుట్ట కమిటీ ఎపిసోడ్లో రాజగోపాల్ రెడ్డి అభిప్రాయానికి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా మద్దతు పలికారు. ఎమ్మెల్యే లేవనెత్తిన అంశంతో ఏకీభవిస్తున్నానని ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పడంతో సమస్యను అదే టెంపోలో కంటిన్యూ చేసినట్టు అయ్యిందని అంటున్నారు.
Also Read
- Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
- OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
- OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
- OTR: పటాన్చెరు కాంగ్రెస్‌లో అసంతృప్తి జ్వాలలు.. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనే ఉన్నామా?
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం యాదగిరిగుట్ట ఆలయ ట్రస్ట్ బోర్డ్‌ను తిరుమల తరహాలో చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే అన్ని వర్గాలు…ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వాలన్న ఆలోచన ఉందట. దానికి తగ్గట్టే ముఖ్యమంత్రి వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వేశారని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. కమిటీ నియామకం వెనక…గుట్ట అభివృద్ధి అజెండా కూడా దాగి ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. అయితే కాంగ్రెస్‌లో మాత్రం ఫీలింగ్ డిఫరెంట్‌గా ఉంది. జిల్లాల వారీగా తమకు కనీసం సమాచారం ఇవ్వలేదన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు స్థానిక నాయకులు. ఈ పరిస్థితుల్లో… ఇప్పటికే లోలోపల రగిలిపోతున్న రాజగోపాల్ రెడ్డికి యాదగిరి గుట్ట ఎపిసోడ్ కలిసివచ్చినట్టైంది. సరే… ఏ ఉద్దేశ్యంతో ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేసినా… పీసీసీ చీఫ్ హోదాలో మహేష్ గౌడ్ దాన్ని సమర్ధించడం మాత్రం కథను ఆసక్తికరమైన మలుపు తిప్పింది. ప్రభుత్వం మాత్రం ఆలయ ట్రస్ట్ బోర్డ్ విషయంలో వ్యూహాత్మకంగానే అడుగువేశామని అంటోంది. ఇక నుంచి కొన్ని కీలకమైన ఆలయాల కమిటీల విషయంలో ఆచితూచి వ్యవహారం నడపాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నారన్నది ఇంటర్నల్
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!