Telegram, Signal: వాట్సాప్ యూజర్‌నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
- టెలిగ్రామ్, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
- వాట్సాప్ ఫీచర్‌పై ఇప్పటికే బ్రేక్
- ప్రభుత్వ ఆందోళన ఏమిటి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో WhatsApp తీసుకురావాలనుకున్న Username Feature ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ ఫీచర్ కారణంగా సైబర్ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మెటాకు నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే అంశంపై Telegram, Signal వంటి ప్రముఖ మెసేజింగ్ యాప్‌లకు కూడా ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) నోటీసులు పంపింది.
టెలిగ్రామ్, సిగ్నల్‌ను ఏమని ప్రశ్నించింది?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, యూజర్‌నేమ్ ఫీచర్‌ను కొనసాగించడానికి ఎందుకు అనుమతించాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. ముఖ్యంగా, యూజర్‌నేమ్‌లను ఉపయోగించి జరిగే నకిలీ గుర్తింపులు, ఫిషింగ్, ఆన్లైన్ మోసాలు వంటి సమస్యలను ఎలా అరికడుతున్నారో వివరించాలని టెలిగ్రామ్, సిగ్నల్‌ను కోరినట్లు సమాచారం.
Also Read
- ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
- WhatsApp: బిగ్ షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఇక ఆ ఫోన్లలో యాప్ పని చేయదు..
- 2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
- నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
వాట్సాప్ ఫీచర్‌పై ఇప్పటికే బ్రేక్
WhatsApp తీసుకురావాలనుకున్న Username Feature ప్రారంభాన్ని కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు మొబైల్ నంబర్‌కు బదులుగా యూజర్‌నేమ్‌తో చాట్ చేసే వీలుంటుంది. అయితే, దీనివల్ల సైబర్ నేరాలు, ఫిషింగ్ దాడులు, డిజిటల్ అరెస్టు పేరుతో జరిగే మోసాలు పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మెటాకు నోటీసు జారీ చేసినట్లు సమాచారం.
ఇతర యాప్‌లపైనా దర్యాప్తు
WhatsApp వ్యవహారం తర్వాత ప్రభుత్వం తన పరిశీలనను ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు కూడా విస్తరించింది. ఇప్పటికే Telegram, Signalలో యూజర్‌నేమ్ ఫీచర్ అందుబాటులో ఉండటంతో, ఆ ఫీచర్ దుర్వినియోగాన్ని ఎలా అరికడుతున్నారో వివరించాలని ఐటీ మంత్రిత్వ శాఖ లేఖలు పంపినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ ఆందోళన ఏమిటి?
యూజర్‌నేమ్‌ల ద్వారా మోసగాళ్లు ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, ప్రముఖ సంస్థలు లేదా ప్రముఖుల పేర్లతో పోలిన నకిలీ ఖాతాలను సృష్టించే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో అమాయక ప్రజలు సులభంగా మోసపోయే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. భద్రతాపరమైన చర్యలపై పూర్తిస్థాయి స్పష్టత వచ్చే వరకు ఈ తరహా ఫీచర్ల అమలుపై ప్రభుత్వం కఠిన వైఖరిని కొనసాగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
భారతదేశమే WhatsAppకు అతిపెద్ద మార్కెట్
ప్రస్తుతం భారతదేశంలో 50 కోట్లకు పైగా WhatsApp వినియోగదారులు ఉన్నారు. అందువల్ల కొత్త ఫీచర్ల అమలు విషయంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అవసరమైతే ఐటీ చట్టం కింద చర్యలు కూడా తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
-
Telangana Assembly: అసెంబ్లీలో మరోసారి హైడ్రామా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు..
-
Varanasi Movie: ‘వారణాసి’ అంతకుమించి.. టాలీవుడ్ చరిత్రలో సరికొత్త రికార్డులు!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!