KTR : వచ్చే ఎన్నికల్లో పొత్తులపై స్పష్టతనిచ్చిన కేటీఆర్
- పొత్తులపై కేటీఆర్ క్లారిటీ
- కొత్త పార్టీలపై సెటైర్లు
- పాదయాత్రతో పార్టీ బలోపేతం
- టీఆర్ఎస్ పేరు మార్పుపై స్పందన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కల్వకుంట్ల కుటుంబం చుట్టూ చర్చ మొదలైంది. ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారనే ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన, కవిత పేరు ఎత్తకుండానే పరోక్షంగా గట్టి కౌంటర్లు ఇచ్చారు.
కొత్త పార్టీల ఆవిర్భావంపై స్పందిస్తూ, ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చు కానీ, ప్రజలు ఓట్లు వేయాలి కదా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మన వ్యక్తిగత బాధలను ప్రజల బాధలుగా చూపిస్తే జనం నమ్మరని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. “పిల్లలు తమ తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదు కానీ, వారిని ఏడిపించకూడదు” అని ఆయన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
షుగర్, బిపి కంట్రోల్ అవ్వాలా? మీ డైట్‌లో ఈ గింజలను చేర్చుకోండి!
రాబోయే ఎన్నికల వ్యూహాలపై స్పష్టతనిస్తూ, భవిష్యత్తులో ఏ పార్టీతోనూ బీఆర్ఎస్‌కు పొత్తులు లేదా సర్దుబాట్లు ఉండబోవని కేటీఆర్ తేల్చి చెప్పారు. తాము చేసిన కొన్ని తప్పుల వల్లే అధికారం కోల్పోయామని అంగీకరిస్తూనే, త్వరలోనే మళ్లీ పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 2027 నుంచి తాను పాదయాత్ర ప్రారంభిస్తానని, అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తానని ప్రకటించారు.
పార్టీ పేరు మార్పుపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చాలనేది ప్రజల నుంచి వస్తున్న బలమైన కోరిక అని కేటీఆర్ అంగీకరించారు. అయితే, పార్టీలో నిర్ణయాలన్నీ “బాస్” కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతాయని, ఆయన ఏది చెబితే అదే ఫైనల్ అని స్పష్టం చేశారు. కుటుంబంలో ఎలాంటి పదవుల గొడవలు లేవని, పార్టీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు.
దేశంలో ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ వచ్చే అవకాశం ఉందని, నియోజకవర్గాల సంఖ్య పెరిగినా తమ వద్ద సమర్థవంతమైన నాయకులు ఉన్నారని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని, స్థిరాస్తి రంగం కుదేలైందని ఆరోపిస్తూ.. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పాలననే కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారం వస్తుందని, పోతుందని.. కానీ పార్టీ , సిద్ధాంతం శాశ్వతమని ఆయన ముగించారు.
Wife Kills Husband: ఇలా తయారయ్యారేంటే.. ప్రియుడితో కలిసి భర్త హత్య..
- Tags
- BRS
- Kavitha
- kcr
- ktr
- Telangana Politics
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?