Wife Kills Husband: ఇలా తయారయ్యారేంటే.. ప్రియుడితో కలిసి భర్త హత్య..
- భార్య చేతిలో మరో భర్త బలి..
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
- దొపిడీగా చిత్రీకరించేందుకు పన్నాగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Kills Husband: ఇటీవల కాలంలో భర్తలను చంపే భార్యలు ఎక్కువ అవుతున్నారు. ఇతరులతో సంబంధాలు పెట్టుకుని భర్తల్ని హతమారుస్తున్నాయి. క్షణిక సుఖాల కోసం పచ్చటి కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. తాజాగా, మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలో కూడా ఇలాంటి దారుణమే చోటు చేసుకుంది. 23 ఏళ్ల మహిళ తన ప్రియుడితో కలిసి కుట్ర పన్ని, భర్తను హతమార్చింది. ఈ నేరాన్ని దోపిడీగా చిత్రీకరించాలని ప్రయత్నించింది. చివరకు పోలీసుల విచారణలో పట్టుబడింది. ఈ సంఘటన అటెర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
కేసులో కీలక నిందితురాలు రూబీని, ఆమె ప్రియుడు విశాల్ విమల్(21)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఏప్రిల్ 8న నిలేష్ జాతవ్(27) అనే వ్యక్తి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని దొంగలు అతడి భార్య రూబీ, వారి చిన్నారి కళ్ల ముందే కాల్చి చంపినట్లు పోలీసులకు సమాచారం అందింది.
Also Read
- Retired GST Commissioner Kidnap Case: విశాఖలో రిటైర్డ్ జీఎస్టీ కమిషనర్ కిడ్నాప్ కలకలం..
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
తాము జమ్నా గ్రామం నుంచి ఖారికాకు తిరిగి వస్తుండగా బ్యాగ్ రోడ్డుపై పడిపోయిందని రూబీ పోలీసులకు చెప్పింది. తన భర్త బైక్ ఆపి, తాను బ్యాగ్ తీసుకోవడానికి వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు తన భర్తపై కాల్పులు జరిపి పారిపోయినట్లు పోలీసులకు చెప్పింది. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన పోలీసులకు దిమ్మతిరిగిపోయే నిజాలు తెలిశాయి.
రూబీ చెబుతున్న విషయాలకు పొంతన లేకపోవడంతో గట్టిగా ప్రశ్నించడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది. రూబీ తన సమీప బంధువైన విమల్‌తో ఏడేళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తోంది. ఇరువుతు తరుచుగా వాట్సాప్ కాల్స్, చాట్స్ ద్వారా మాట్లాడుకునే వారు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన రూబీ, భర్తను ఎలాగైన అడ్డుతప్పించుకోవాలని హత్యకు ప్లాన్ చేసింది. ప్రణాళిక ప్రకారం, ముందుగా నిర్ణయించుకున్న ప్రాంతంలో బ్యాగ్ పడిపోయేలా చేసింది, దీని కోసమే ఎదురుచూస్తున్న విమల్, జాతవ్‌ను కాల్చి చంపాడు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తాజావార్తలు
-
LK Advani Health Update: ఐసీయూలో మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ.. హెల్త్ బులిటిన్ విడుదల..
-
Naga Vamsi : భారీ రేట్లు చూసి భయపడ్డా కానీ దసరాకే లాభాల పంట.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Deva : రజనీ బాషా మ్యూజిక్ డైరెక్టర్ మృతి
-
TGSPDCL: తెలంగాణలో రికార్డు స్థాయి విద్యుత్ డిమాండ్.. ఈ సింపుల్ టిప్స్‌తో మీ ఇంట్లో కరెంట్‌ను సేవ్ చేయండి..
-
Katie Zacharia: ట్రంప్‌తో పని చేయడం గౌరవంగా ఉంది.. వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీగా తొలగింపుపై జకారియా కీలక పోస్ట్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!