KTR : సింగరేణి స్కామ్‌పై కేటీఆర్ సవాల్.. రేవంత్‌కు డైరెక్ట్ ఛాలెంజ్
- సింగరేణి వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు డిమాండ్
- విదేశీ బొగ్గు కొనుగోళ్లలో కమిషన్ల దందా ఉందని ఆరోపణ
- రేవంత్‌ను ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’ అంటూ కేటీఆర్ విమర్శలు
- నీటి ఎద్దడికి ప్రభుత్వమే కారణమంటూ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సంపేట నియోజకవర్గ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సింగరేణిలో జరిగిన అక్రమాలు, కుంభకోణాలపై తాము నిలదీస్తే రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మీడియా ముందు ఆరోపణలు చేయడం కాదని, దమ్ముంటే సింగరేణి కుంభకోణాలు , ప్రతిపాదిత విదేశీ బొగ్గు కొనుగోళ్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. కేవలం బొగ్గు అంశమే కాకుండా, సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది సింగరేణిలో కొల్లగొట్టిన రూ. 10 వేల కోట్ల కుంభకోణంతో పాటు సోలార్ పవర్ స్కామ్‌పై కూడా సమగ్ర న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
విదేశీ బొగ్గు కుట్ర వెనుక కమిషన్ల దందా
తెలంగాణలో 70 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం ఉన్న సింగరేణిని పక్కన పెట్టి, విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవడానికి రేవంత్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేటీఆర్ ఆరోపించారు. స్థానికంగా టన్ను బొగ్గు రూ. 3,800కి దొరికితే, ఆస్ట్రేలియా తదితర విదేశాల నుంచి కొనుగోలు చేస్తే రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ధర పడుతుందని, అక్కడ వచ్చే కమీషన్ల కోసమే ఈ విదేశీ కొనుగోళ్ల డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ హయాంలో సింగరేణి అండతోనే రాష్ట్రంలో 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా సాధ్యమైందని, కానీ నేడు రేవంత్ రెడ్డి ఆ సంస్థను బదనామ్ చేస్తూ సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
- ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
- KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
- TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
‘ఈఎంఐ’ ముఖ్యమంత్రి.. రికవరీ ఏజెంట్లుగా ఏఐసీసీ పెద్దలు
సీఎం రేవంత్ రెడ్డిని ‘ఈఎంఐ ముఖ్యమంత్రి’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని హైకమాండ్‌కు ప్రతి నెలా ఈఎంఐ కట్టకుంటే ఆయన పదవి గల్లంతవుతుందని, అందుకే సింగరేణిని అడ్డంపెట్టుకుని స్కామ్‌లు చేసి ముడుపులు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాష్ట్రంలో ఒక రికవరీ ఏజెంట్ లాగా వ్యవహరిస్తూ, రేవంత్ నుంచి కమిషన్లు వసూలు చేసే పనిలో ఉన్నారని ఆరోపించారు. ఇష్టానుసారంగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు విద్యుత్ కొనుగోళ్ల పేరుతో ఛత్తీస్‌గఢ్ ఒప్పందాలపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తాము గతంలో రూ. 3.90 కే యూనిట్ కొంటే కుంభకోణమన్న కాంగ్రెస్ నేతలు, నేడు రూ. 15 పెట్టి కొనాలని చూస్తున్న తీరును ఏమనాలని ప్రశ్నించారు.
ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
రాష్ట్రంలో నెలకొన్న తాగు, సాగునీటి ఎద్దడిపై స్పందిస్తూ.. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని కేటీఆర్ విమర్శించారు. ఆరు నెలల ముందే కాలేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయాలని తాము విజ్ఞప్తి చేసినా, తాను చేసిన తప్పులు బయటపడతాయనే భయంతో రేవంత్ ఆ పని చేయలేదని ఆరోపించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా నీళ్లు ఎత్తకపోవడంతో వృథాగా పోయాయని, నేడు పంటలు ఎండిపోతుంటే ‘ఎల్-నినో’ పేరుతో చేతులెత్తేస్తున్నారని దుయ్యబట్టారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జలపండగ చేసుకుంటూ 700 కిలోమీటర్ల దూరంలోని కుప్పం దాకా నీళ్లు తరలించుకుంటుంటే, కేవలం 70 కిలోమీటర్ల దూరంలోని మహబూబ్‌నగర్‌కు కూడా నీళ్లు ఇచ్చుకోలేని చేతకాని స్థితిలో రేవంత్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారని, రాజకీయాలు పక్కన పెట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
-
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!