Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- మీరట్ స్నేక్ మర్డర్ కేసులో కోర్టు సంచలన తీర్పు..
- భర్తను చంపిన భార్య, ఆమె లవర్‌కు ఉరిశిక్ష విధింపు..
- అత్యంత అరుదైన కేసుగా పరిగణించిన న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Murder Case: మీరట్‌లో స్నేక్ మర్డర్ కేసులో మీరట్ కోర్టు సంచనల తీర్పు వెలువరించింది. భర్తను చంపిన భార్య, ఆమె ప్రియుడికి కోర్టు ‘‘ఉరిశిక్ష’’ విధించింది. భార్య రవిత, ఆమె పొరుగింటి వ్యక్తి అమర్దీప్ కలిసి భర్త అమిత్ కశ్యప్‌ను గొంతు నులిమి హత్య చేశారు. హత్య, నేరపూరిత కుట్ర కేసుల్లో అక్టోబర్ 07న కోర్టు ఇద్దర్ని దోషులుగా నిర్ధారించింది. తాజాగా శుక్రవారం శిక్షను ఖరారు చేసింది. ‘‘అత్యంత అరుదైన కేసు’’గా పరిగణించిన కోర్టు మరణశిక్షను విధించింది.
పాము కాటుగా డ్రామా..
ఉత్తర్ ప్రదేశ్‌లో మీరట్ జిల్లాలోని అక్బర్పూర్ సాదత్ గ్రామంలో 2025 ఏప్రిల్ 12న అమిత్ కశ్యప్ అలియాస్ మిక్కీ తన ఇంట్లో మరణించి కనిపించాడు. అతడి మృతదేహం కింద పాము కనిపించింది. దీంతో తొలుత కుటుంబం ఇది పాము కాటు వల్ల సంభవించిన మరణంగా భావించింది. నిందితులు ఇద్దరు దీనిని సహజం మరణంగా చూపించేందుకు మృతదేహం కింద పామును ఉంచినట్లు విచారణలో తేలింది. ఆ పాము కూడా విషరహితమైందిగా వెల్లడైంది.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
అమిత్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో పాము కాటుతో మరణించలేదని, గొంతు నులిమి ఊపిరాడక మరణించినట్లు తేలింది. దీనిని హత్య నమోదు చేసిన పోలీసులు భార్య రవిత, లవర్ అమర్‌దీప్‌లను అరెస్ట్ చేశారు.
సతీ సావిత్రిని ప్రస్తావించిన కోర్టు..
ఈ కేసులో పోలీసులు 500 పేజీలకు పైగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొబైల్ ఫోన్ రికార్డులు, పోస్టుమార్టం నివేదిక ఆధారాలు కేసులో కీలకంగా మారాయి. అమిత్ మరణానికి ముందు నిందితులిద్దరరూ ఏకంగా నాలుగు రోజుల్లో 70కి సార్లకు పైగా మాట్లాడుకున్నట్లు వెల్లడైంది.
శిక్ష ఖరారు చేసే సందర్భంలో న్యాయమూర్తి భార్య భర్తకు అర్ధాంగి అని, తన భర్త ప్రాణాలు కాపాడేందుకు యముడితో పోరాడిన సావిత్ర కథను గుర్తుచేశారు. ఈ కేసులో నిందితులు ముందస్తు ప్రణాళికతో హత్య చేయడం, దాన్ని పాము కాటుగా చిత్రీకరించడం దర్యాప్తును తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసినట్లు కోర్టు గుర్తంచింది. నిందితులకు మరణశిక్ష విధించడంతో మృతుడు తల్లి ఆనందం వ్యక్తం చేశారు. మొదటి నుంచి అమిత్ కుటుంబం నిందితులకు మరణశిక్ష విధించాలని కోరుతున్నారు.
తాజావార్తలు
-
CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
-
OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదుపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!