KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. “ఒక్కసారి గర్జిస్తున్న ఈ బాహుబలి పంపులు చూడండి. కేసీఆర్ నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్‌హౌస్‌లో ఉన్న 145 మెగావాట్ల పంపులు ఇవి. ప్రపంచంలో ఇంత పెద్ద ఇరిగేషన్ పంపులు మరెక్కడా లేవు. కృష్ణా నది మీదున్న శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది జూలై 29న ఇన్‌ఫ్లోలు ప్రారంభమయ్యాయి. కానీ 76 రోజుల పాటు కుంభకర్ణ నిద్రపోయింది రేవంత్ సర్కారు. అనేకసార్లు బీఆర్ఎస్ నాయకులు ఈ మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తే మేల్కొని మొన్న నార్లాపూర్ పంప్‌హౌస్‌లో పంపింగ్ ప్రారంభించింది. ఈ సీజన్లో వరద వచ్చినప్పటి నుండి నేటి వరకు పంపింగ్ చేసి ఉంటే సుమారు 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేది. అంటే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. కానీ కేవలం కేసీఆర్ గారికి పేరు రావద్దు అన్న కుట్రతో ఇక్కడ నీటిని ఎత్తిపోయలేదు రేవంత్ ప్రభుత్వం! ఫలితంగానే ఇవ్వాళ తీవ్రమైన సాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు తెలంగాణ రైతన్నలు.” అని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చారు.
జూన్ 01, 2026 నుంచి ఈరోజు వరకు 50+ టీఎంసీల గోదావరి నీళ్లను.. 250 టీఎంసీల కృష్ణా నీళ్లను.. దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్ అంటూ కేటీఆర్ ఆరోపించారు. “కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని.. గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవకాశామున్నా.. పట్టించుకోలేదు. పాలమూరు – రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు. ఎల్ నినో వస్తున్నదని. ఈ ఏడాది మార్చి నుంచే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే.. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను. పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపోయింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది.” అని మరో పోస్ట్‌లో కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
- YCP Office Fire: వైసీపీ ఆఫీసుకు నిప్పుపెట్టిన టీడీపీ కార్యకర్తలు.. పలువురికి గాయాలు, 10 వాహనాలు దగ్ధం!
ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
ఒక్కసారి గర్జిస్తున్న ఈ బాహుబలి పంపులు చూడండి. కేసీఆర్ గారు నిర్మించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ పంప్‌హౌస్‌లో ఉన్న 145 మెగావాట్ల పంపులు ఇవి.
ప్రపంచంలో ఇంత పెద్ద ఇరిగేషన్ పంపులు మరెక్కడా లేవు.
కృష్ణా నది మీదున్న శ్రీశైలం జలాశయానికి ఈ ఏడాది జూలై 29న ఇన్‌ఫ్లోలు ప్రారంభమయ్యాయి. కానీ 76 రోజుల పాటు కుంభకర్ణ నిద్రపోయింది రేవంత్ సర్కారు.
అనేకసార్లు బీఆర్ఎస్ నాయకులు ఈ మోటార్లు ఆన్ చేయాలని డిమాండ్ చేస్తే మేల్కొని మొన్న నార్లాపూర్ పంప్‌హౌస్‌లో పంపింగ్ ప్రారంభించింది.
ఈ సీజన్లో వరద వచ్చినప్పటి నుండి నేటి వరకు పంపింగ్ చేసి ఉంటే సుమారు 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉండేది.
అంటే నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది.
కానీ కేవలం కేసీఆర్ గారికి పేరు రావద్దు అన్న కుట్రతో ఇక్కడ నీటిని ఎత్తిపోయలేదు రేవంత్ ప్రభుత్వం!
ఫలితంగానే ఇవ్వాళ తీవ్రమైన సాగునీటి కొరత ఎదుర్కొంటున్నారు తెలంగాణ రైతన్నలు.
— KTR (@KTRBRS) October 16, 2026
తాజావార్తలు
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
ట్రెండింగ్
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!