Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
- CJI జస్టిస్ సూర్యకాంత్‌పై సంజయ్ రౌత్ అనుచిత వ్యాఖ్యలు..
- సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
- న్యాయవ్యవస్థపై దాడులు దురదృష్టకరమన్న సుప్రీంకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన శివసేన(యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సంజయ్ రౌత్‌తో పాటు జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లేకు సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (SCBA) సంజయ్ రౌత్, నిఖిల్ వాగ్లేపై క్రిమినల్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్బాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
విచారణ సందర్భంగా.. ‘‘రాజ్యాంగ సంస్థలపై దాడులు చేయడం దురదృష్టకరం. ప్రజలు తాము ఒక ఉచ్చులో చిక్కుకుంటున్నామనే విషయాన్ని అర్థం చేసుకోవడం లేదు. హక్కులను పరిరక్షించడంలో న్యాయస్థానాలు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. అయినప్పటికీ విమర్శలు కొనసాగిస్తే అది దురదృష్టకరం’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read
- Dharmendra Pradhan: ‘‘బంగ్లాదేశ్ నుంచి స్పూర్తి’’.. రాహుల్ గాంధీ, సీజేపీపై ధర్మేంద్ర ప్రధాన్ ఫైర్..!
- Petrol and Diesel Price Hike: పెట్రోల్ ధరలపై షాకింగ్ న్యూస్.. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరిక.. వడ్డీ రేట్లకూ రెక్కలు?
- Congress: ‘‘ప్రభుత్వ మార్పే మా లక్ష్యం’’.. స్పష్టం చేసిన కాంగ్రెస్..
- Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై కోర్టు సమన్లు..
అక్టోబర్ 12న ప్రతిపక్షాల బృందాన్ని కలవడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరాకరించిన తర్వాత సంజయ్ రౌత్ సీజేఐని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి చెందిన రాజకీయ కార్యక్రమాలకు న్యాయమూర్తులు హాజరవుతారని, ముఖ్యమంత్రులు ఇచ్చే విందుల్లో పాల్గొంటారని, కానీ ప్రతిపక్ష నేతలను మాత్రం కలవడం లేదని వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ నిఖిల్ వాగ్లే తన ఎక్స్ అకౌంట్లో సీజేఐని ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని, న్యాయవ్యవస్థ న్యాయమైన పరిమితి దాటిందని పిటిషన్ పేర్కొంది.
విషయం పెద్దది కావడంతో జర్నలిస్ట్ నిఖిల్ క్షమాపణలు చెప్పారు. అయితే, తనను టార్గెట్‌గా చేసుకుంటున్నారని సంజయ్ రౌత్ ఆరోపించారు. తాను మాట్లాడటం ఆపబోనని, అవసరమైతే జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. సుప్రీంకోర్టుపై గతంలో పలువురు ప్రముఖులు, రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, రాజకీయ నేతలు వ్యాఖ్యలు చేశారని రౌత్ అన్నారు. అయినప్పటికీ తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
-
Gopichand: ఆ హీరో కమ్‌బ్యాక్‌కు రిలీజ్ డేట్ల గ్రహణం!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!