Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
- అమెజాన్ కొత్త Bee Frontier, Bee Eclipse AI డివైజ్‌లను విడుదల
- సంభాషణలను విశ్లేషించి సారాంశాలు, రిమైండర్లు, టు-డూ లిస్టులు..
- Bee Frontier అవుట్డోర్ వినియోగం కోసం
- IP67 రేటింగ్, ఏడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Bee Frontier, Bee Eclipse: అమెజాన్ వ్యక్తిగత వినియోగం కోసం బీ ఫ్రాంటియర్ (Bee Frontier), బీ ఎక్లిప్స్ (Bee Eclipse) పేరుతో కొత్త AI డివైజ్‌లను విడుదల చేసింది. ఇవి వినియోగదారుల సంభాషణలను విశ్లేషించి సారాంశాలు, రిమైండర్లు, టు-డూ లిస్టులు, వ్యక్తిగత సూచనలను రూపొందించగలవు. రెండు డివైజ్‌లలోనూ మల్టీ-ఫంక్షన్ బటన్, Alexa సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
బీ ఫ్రాంటియర్ ను ప్రత్యేకంగా అవుట్డోర్ వినియోగం కోసం రూపొందించారు. దీన్ని చేతికి ధరించవచ్చు లేదా దుస్తులకు క్లిప్ చేసుకోవచ్చు. సిలికాన్ రిస్ట్‌బ్యాండ్, IP67 రేటింగ్‌తో వచ్చే ఈ డివైజ్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని అమెజాన్ చెబుతోంది. USB Type-C ఛార్జింగ్, డ్యూయల్ నాయిస్-ఫిల్టరింగ్ మైక్రోఫోన్లు, మైక్రోఫోన్ బటన్, ఆడియో ప్రాసెసింగ్ సమయంలో వెలిగే LED ఇండికేటర్ ఇందులో ఉన్నాయి.
Also Read
- డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
- 6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
- Reliance: "కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..".. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
- డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
మరోవైపు బీ ఎక్లిప్స్ మాత్రం స్మార్ట్‌ఫోన్‌తో ఉపయోగించేందుకు రూపొందించారు. క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండే ఈ AI డివైజ్‌ను MagSafe తరహాలో ఫోన్ వెనుక భాగానికి మ్యాగ్నెటిక్గా అమర్చుకోవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 21 రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో డివైజ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయడానికి ప్రత్యేక బటన్, సంభాషణ ప్రాసెసింగ్ జరుగుతున్నప్పుడు సూచించే LED లైట్ ఉన్నాయి.
ఈ రెండు డివైజ్‌లు సంభాషణల్లోని అపాయింట్మెంట్లు, షాపింగ్ లిస్టులు, ప్రయాణ ప్రణాళికలు వంటి సమాచారాన్ని గుర్తుంచుకుని, వాటిని సారాంశాలు, రిమైండర్లు, టు-డూ లిస్టులు, వ్యక్తిగత ఇన్సైట్స్గా మార్చగలవు. వీటిని Bee మొబైల్ యాప్‌తో పాటు డెస్క్‌టాప్ యాప్‌లో కూడా చూడొచ్చు. ఇందులో జిమెయిల్, గూగుల్ క్యాలెండర్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, ఆపిల్ హెల్త్‌కిట్ వంటి సేవలతో ఇంటిగ్రేషన్ సదుపాయం ఉంది. అలాగే Alexa+తో అనుసంధానం చేయడం ద్వారా Bee యాప్‌ను ఓపెన్ చేయకుండానే వాయిస్ కమాండ్ల ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. Amazon.com ఇంటిగ్రేషన్ ద్వారా సంభాషణల్లో ప్రస్తావించిన ఉత్పత్తులకు సంబంధించిన షాపింగ్ సూచనలను కూడా పొందే అవకాశం ఉంటుంది.
ప్రైవసీ కోసం Bee Frontier, Bee Eclipseలో Amazon రూపొందించిన Bee Private Compute సెక్యూరిటీ ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించారు. సంభాషణల ట్రాన్స్క్రిప్ట్లు వినియోగదారు డివైజ్ నియంత్రణలో ఉండే కీస్‌తో ఎన్‌క్రిప్ట్ అవుతాయని కంపెనీ చెబుతోంది. ఆడియో ప్రాసెసింగ్ పూర్తయ్యాక ఆడియో స్టోర్ చేయబడదని కూడా పేర్కొంది. వినియోగదారులు తమ ట్రాన్స్క్రిప్ట్లు, సారాంశాలను ఎప్పుడైనా తొలగించుకోవచ్చు. ధర విషయానికి వస్తే.. బీ ఫ్రాంటియర్ ధర $74.99 (సుమారు రూ.6,600). ఇది ఓనిక్స్, లావెండర్, సేజ్ రంగుల్లో లభిస్తుంది. బీ ఎక్లిప్స్ ధర $99.99 (సుమారు రూ.8,800) కాగా, బ్లష్, మిడ్నైట్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అమెజాన్ Bee Pro సబ్‌స్క్రిప్షన్‌ను నెలకు $11.99 (సుమారు రూ.1,000)కి అందిస్తోంది. ఇందులో అపరిమిత తాజా సంభాషణ సారాంశాలు, Amazon.com, Alexa+ మరియు థర్డ్ పార్టీ యాప్ ఇంటిగ్రేషన్లు, సూచించిన టు-డూలు, డైలీ మెమరీస్ వంటి ఫీచర్లు ఉంటాయి. కొత్త Bee వినియోగదారులకు 30 రోజుల ఉచిత ట్రయల్ లభిస్తుంది. అయితే సబ్స్క్రిప్షన్ లేకుండానే అన్ని Bee వినియోగదారులకు సంభాషణ సారాంశాలు, రీక్యాప్స్, 14 రోజుల మెమరీ అందుబాటులో ఉంటాయి.
Introducing Bee Frontier and Bee Eclipse, two personal AI devices designed to remember the moments that matter most. One wears on your wrist. One attaches to your phone. Both keep you present. ↓ https://t.co/leJ8GRLZgP
— bee (@bee__computer) October 15, 2026
తాజావార్తలు
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!