TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
- టీవీఎస్ రైడర్ 125కు కొత్త సేఫ్టీ, కన్వీనియన్స్ ఫీచర్లు
- 125cc సెగ్మెంట్లో తొలిసారిగా Traction Control System (TCS)
- ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ ఫీచర్
- 27W USB Type-C ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TVS Raider 125: 125cc కమ్యూటర్ బైక్ విభాగంలో టీవీఎస్ రైడర్ (TVS Raider) మరిన్ని సేఫ్టీ, కన్వీనియన్స్ ఫీచర్లతో అప్డేట్ అయ్యింది. ముఖ్యంగా Traction Control System (TCS)ను పొందింది. 125cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్లో TCS అందిస్తున్న తొలి బైక్ ఇదేనని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు ఈ ఫీచర్లు Raider TFT DD, SXC DD వేరియంట్లలో అందుబాటులోకి వచ్చాయి. వెట్ రోడ్లు, గ్రావెల్ లేదా గుంతలున్న రోడ్లపై వెనుక చక్రం గ్రిప్ కోల్పోయినప్పుడు TCS ట్రాక్షన్‌ను మెరుగుపరుస్తుంది. దీంతో తక్కువ గ్రిప్ ఉన్న రోడ్లపై రైడర్‌కు మరింత కంట్రోల్, కాన్ఫిడెన్స్ లభిస్తుంది.
అలాగే ఇందులో ఎమర్జెన్సీ బ్రేక్ వార్నింగ్ (EBW) ఫీచర్‌ను కూడా తీసుకొచ్చారు. రైడర్ అకస్మాత్తుగా లేదా బలంగా బ్రేక్ వేసినప్పుడు వెనుక నుంచి వచ్చే వాహనాలను అప్రమత్తం చేయడానికి ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దీంతో వెనుక నుంచి ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సేఫ్టీ ఫీచర్లతో పాటు బైక్‌కు వెడల్పాటి రియర్ టైర్‌ను అందించారు. ఇది గ్రిప్, స్టెబిలిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే 27W USB Type-C ఫాస్ట్ ఛార్జర్‌ను అందించారు. నావిగేషన్ కోసం స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
Also Read
- కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
- కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
- Kawasaki Z300 India Launch: Kawasaki Z300 భారత్‌లోకి.. ధర ఎంత? 296cc ఇంజిన్, ఫీచర్లు, లాంచ్ డేట్ వివరాలు!
- TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
మెకానికల్‌గా ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు. 3-వాల్వ్ ఇంజిన్‌తోనే కొనసాగుతోంది. ఇందులో iGO Assist with Boost Mode, Glide Through Technology (GTT)**తో పాటు 99కి పైగా కనెక్టెడ్ ఫీచర్లను అందించే TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.ఈ కొత్త TVS Raider TFT DD ధర రూ.1,03,170 కాగా, Raider SXC DD ధర రూ.1,00,330గా ఉంది. ఇవి రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు. కొత్త వేరియంట్లు దేశవ్యాప్తంగా TVS అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి.
తాజావార్తలు
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
Donald Trump: జనం పర్సులు నిల్.. ప్రెసిడెంట్ గారి ఆదాయం మాత్రం ఫుల్..!
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..