KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
- కిట్ క్యాట్ ప్యాకెట్ తెరవగానే షాక్
- పిల్లల కోసం కొన్న చాక్లెట్లో పురుగులు ఉన్నాయంటూ ఫిర్యాదు
- ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేపట్టాలని డిమాండ్
- మాల్ యాజమాన్యం స్పందనపై ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పండుగ వేళ నగరంలోని ప్రముఖ మాల్స్‌లో కొనుగోలు చేసే తినుబండారాల నాణ్యతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కూకట్‌పల్లిలోని ప్రఖ్యాత లులు మాల్లో షాపింగ్ చేసిన ఓ కస్టమర్‌కు షాకింగ్ అనుభవం ఎదురైంది. తన పిల్లల కోసం ఎంతో ఆప్యాయంగా కొనుగోలు చేసిన కిట్ క్యాట్ చాక్లెట్లో పురుగులు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. పండుగ ఆనందంలో ఉత్సాహంగా ఉండాల్సిన ఆ కుటుంబాన్ని ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి, ఆందోళనకు గురిచేసింది.
ఇంటికి తీసుకెళ్లి ఓపెన్ చేయగా.. కంగుతిన్న కస్టమర్
లులు మాల్లో కొనుగోలు చేసిన చాక్లెట్లను ఇంటికి తీసుకెళ్లి పిల్లలకు ఇచ్చేందుకు ఓపెన్ చేసి చూడగా, అందులో పురుగులు కదులుతూ కనిపించాయి. ఇది చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైన కస్టమర్ కుటుంబ సభ్యులు.. చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్లలోనే ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే ఎలా అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. లులు మాల్ లాంటి పెద్ద మాల్లోనే ఉత్పత్తుల నిల్వ సరిగా లేకపోతే ఎలానని, వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారంటూ మండిపడ్డారు. ఈ ఘటనపై వెంటనే సంబంధిత కంపెనీకి ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
Also Read
ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టాలని డిమాండ్
పెద్ద పెద్ద మాల్స్‌లో బ్రాండెడ్ ఉత్పత్తుల పేరుతో నాసిరకం లేదా సరిగా నిల్వ చేయని వస్తువులను అమ్ముతున్నారనే అనుమానాలు ఈ ఘటనతో బలపడుతున్నాయి. లులు మాల్లో వెలుగుచూసిన ఈ ఉదంతంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే స్పందించి, మాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని.. నాసిరకం చాక్లెట్లు, తినుబండారాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
పండగ వేళ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
పండుగ సీజన్లో చాక్లెట్లు, స్వీట్లు, ఇతర తినుబండారాలు కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ పదార్థం కొన్నప్పటికీ తయారీ తేదీ, ఎక్స్పైరీ డేట్, ప్యాకింగ్ సరిగా ఉందో లేదో క్షుణ్ణంగా చెక్ చేసుకోవాలని హెచ్చరిస్తున్నారు. పిల్లల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో విస్తృత తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉండగా, ఈ ఘటనపై లులు మాల్ యాజమాన్యం , సంబంధిత కంపెనీ ఏవిధంగా స్పందిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!