Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sundeep Kishan: విభిన్నమైన కథలతో అలరించే యంగ్ హీరో సందీప్ కిషన్ ఈసారి ఎవరూ ఊహించని రేంజ్లో పెద్ద ప్లాన్ వేశారు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా భారీ ప్రాజెక్ట్ ‘కరికాల’ గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా లాంచ్‌లో హీరోయిన్లు కేథరిన్ థ్రెసా, గాయత్రి భరద్వాజ్, సాక్షి మడోల్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఈ సినిమా చుట్టూ ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడవడానికి అసలు కారణం ఏంటంటే.. ఈ కథను ఏకంగా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండటమే.
సాధారణంగా పార్ట్ 1, పార్ట్ 2 మధ్య ఏడాది నుంచి రెండేళ్ల దాకా గ్యాప్ ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో షూటింగ్ మొదలవ్వక ముందే రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చారు. మొదటి చాప్టర్‌ను 2027 జూలై 2న, ఆ వెంటనే రెండో చాప్టర్‌ను కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే అంటే 2027 అక్టోబర్ 28న థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. ‘‘నా ఫ్రెండ్ ఆది వల్లే డైరెక్టర్ యుగంధర్, నిర్మాతలు రాజశేఖర్, మహిధర్ పరిచయమయ్యారు. డైరెక్టర్ కథ చెబుతున్నంతసేపు రెండు భాగాలు అని చెప్పినా ఒక్క క్షణం కూడా బోర్ కొట్టలేదు. గత ఆరేడు నెలలుగా మా డైరెక్టర్ నిద్రలేకుండా ప్రీ-ప్రొడక్షన్ పనుల్లోనే ఉన్నారు. ఈ కథను నమ్మి ప్రాజెక్ట్‌లోకి వచ్చిన కేథరిన్, గాయత్రి, సాక్షిలకు థాంక్స్. శ్రీ చరణ్ అద్భుతమైన పాటలు రెడీ చేస్తున్నారు. కచ్చితంగా ‘కరికాల’ నా కెరీర్లోనే ది బెస్ట్ మూవీ అవుతుంది’’ అంటూ ఈ సినిమాపై పూర్తి నమ్మకం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల రోజే రెండు రిలీజ్ డేట్లతో సందడి మొదలుపెట్టిన ‘కరికాల’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
-
ORR Arbitration : సుప్రీంకోర్టులో HMDAకి షాక్.. ORR కేసులో కీలక మలుపు
-
Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ ‘బడ్జెట్ పిచ్చి’ ఎవరిని ముంచుతుంది?
-
Ranabaali Box Office: ‘రణబాలి’ సేఫ్ కావాలంటే అన్ని కోట్లు కొల్లగొట్టాల్సిందేనా?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!