తెలంగాణకు కృష్ణా బోర్డు లేఖ… ఆ డీపీఆర్‌లు ఇవ్వండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత ముదురుతున్నాయి. కృష్ణా జలాలపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు పోటాపోటీగా లేఖలు రాస్తున్నాయి. అయితే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణా నది యాజమాన్య బోర్డు లేఖ రాసింది… రాష్ట్రంలో కృష్ణా బేసిన్ పై నిర్మించిన, నిర్మాణం చేపడుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లు ఇవ్వాలని లేఖలో పేర్కొంది కేఆర్‌ఎంబీ… కాగా, ఇప్పటి వరకు ఒక రాష్ట్రం పై మరో రాష్ట్రం ఆరోపణలు చేస్తూ రాగ… ప్రస్తుతం తమ వాటాల ప్రకారం నీటిని కేటాయించాలని లేఖలు రాస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబికి రాసిన లేఖలో వాటాల ప్రస్తావనే వివాదాస్పదంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అభ్యంతరాలు చెబుతున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం జలాశయానికి 4 లక్షల క్యూసెక్కులకుపైగా వరదనీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి మట్టం ఇప్పటికే మినిమం డ్రా డౌన్ లెవల్ దాటి పోయింది. 863.70అడుగుల నీటి వద్ద, జలాశయంలో 117.77 టిఎం సిల నీరునిలువ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఎపి ప్రభుత్వం శ్రీశైలం జలాశయం నుంచి 27 టిఎంసిల నీటిని వినియోగించుకునేందుకు బోర్డును అనుమతి కోరింది. ఈ నీటిలో చెన్నై నగర తాగునీటి అవసరాలకు 3 టిఎంసిలు, తెలుగుగంగ కాలువకు 7 టిఎంసిలు, శ్రీశైలం కుడిగట్టుకాలువ పథకం, గాలేరు నగరి పథకానికి కలిపి 8టిఎంసిలు, హంద్రీనీవా పథకానికి 7 టిఎంసిలు, కర్నూలు-కడప కాలువకు 2 టీఎంసీలు అవసరం అని లేఖ ద్వారా కృష్ణా రివర్ బోర్డుకు వివరించింది. అయితే తెలంగాణ రాష్ట్రం వినియోగించుకున్న నీటి లెక్కల ప్రస్తానే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. కృష్ణా జలాలను ఇప్పటివరకు వాడుకుందని ఎపి తన లేఖ ద్వారా బోర్డుకు తెలిపింది. అంతేకాకుండా ఎపికి 66 శాతం, తెలంగాణకు 34 శాతం దామాషా పద్ధతిలో … తమకు కూడా 160టిఎంసిల నీటిని వాడుకునే హక్కు కల్పించాలని బోర్డుకు లేఖద్వారా తెలిపింది ఏపీ సర్కార్.. దీనిపై తెలంగాణ నీటిపారుదల శాఖ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కేఆర్‌ఎంబీయే… తెలంగాణ సర్కార్‌కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.
Also Read
- Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
- TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
తాజావార్తలు
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు ఇస్తాం.. సంజయ్ రౌత్ యూటర్న్..
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్‌ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!