JD Vance-Iran: జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్య హెచ్చరిక?
- అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
- వైట్‌హౌస్ ఖండన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల నేపథ్యంలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు ఇరాన్ రహస్యంగా హెచ్చరిక పంపిందని ఓ నివేదిక వెల్లడించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ శాంతి చర్చలను ఆర్థిక లాభాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఇరాన్ ఆరోపించినట్లు డ్రాప్ సైట్ న్యూస్ (Drop Site News) కథనం పేర్కొంది. సున్నితమైన శాంతి చర్చలను స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేశారని జేడీవాన్స్‌కు సమాచారం అందించినట్లు నివేదిక ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను వైట్‌హౌస్ తీవ్రంగా ఖండించింది.
డ్రాప్ సైట్ న్యూస్ కథనం ప్రకారం.. జూన్ చివరిలో స్విట్జర్లాండ్‌లోని లేక్ లూసెర్న్ దగ్గర జరిగిన అమెరికా-ఇరాన్ చర్చల సమయంలో మధ్యవర్తి ద్వారా రహస్య సందేశాన్ని జేడీ వాన్స్‌కు పంపినట్లు ఇరాన్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. జూన్ 17న రూపొందించిన శాంతి ఒప్పంద ముసాయిదాను శాశ్వత ఒప్పందంగా మార్చే ప్రయత్నాలను స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ దెబ్బతీస్తున్నారని ఇరాన్ పేర్కొన్నట్లు నివేదిక తెలిపింది.
Also Read
- Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
- Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
- Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ఇరాన్ ఆరోపణల ప్రకారం.. ఈ ఇద్దరూ శాంతి చర్చల ద్వారా లభిస్తున్న రహస్య సమాచారాన్ని ఉపయోగించి ఆర్థిక మార్కెట్లలో లాభాలు పొందడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని ఆరోపించింది. అంతేకాకుండా చర్చలకు సంబంధించిన సమాచారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చేరుతోందన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేసినట్లు కథనం పేర్కొంది. ‘‘జేడీ వాన్స్‌కు ప్రత్యేక మార్గం ద్వారా సమాచారం, విశ్లేషణలను పంపించాం. విట్కాఫ్, కుష్నర్ దౌత్య ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ చర్చల వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు.’’ అని ఇరాన్ అధికారి పేర్కొన్నట్లు కథనంలో వెల్లడైంది.
ఇరాన్ మధ్యవర్తులకు సమర్పించిన పత్రాల్లో ట్రంప్‌కు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు యుద్ధం, శాంతి చర్చలకు సంబంధించిన పరిణామాలను ఉపయోగించి ఆర్థిక మార్కెట్లను ప్రభావితం చేశారని ఆరోపించినట్లు నివేదిక తెలిపింది. ఈ చర్యల ద్వారా సుమారు 9 బిలియన్ డాలర్ల లాభాలు ఆర్జించినట్లు ఇరాన్ అంచనా వేసిందని, అందులో 4.5 బిలియన్ డాలర్లు ఇరాన్‌కు కేటాయించాలని కూడా డిమాండ్ చేసినట్లు కథనంలో పేర్కొన్నారు. అయితే ఈ ఆర్థిక ఆరోపణలను స్వతంత్రంగా ధృవీకరించలేకపోయినట్లు డ్రాప్ సైట్ న్యూస్ స్పష్టం చేసింది.
వైట్‌హౌస్ ఖండన
ఈ ఆరోపణలను అమెరికా ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది. వైట్‌హౌస్ ప్రతినిధి అన్నా కెల్లీ మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి సందేశం అమెరికాకు ఎప్పుడూ అందలేదు. ఇరాన్ ప్రచారానికి వేదికగా మారడం విచారకరం.’’ అని వ్యాఖ్యానించారు. మరో అమెరికా అధికారి కూడా.. ‘‘జేడీ వాన్స్ లేదా ఆయన బృందానికి ఇలాంటి సమాచారం ఎప్పుడూ చేరలేదు. అధ్యక్షుడి చర్చల బృందం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం.’’ అని స్పష్టం చేశారు. అయితే ఈ ఆరోపణలపై స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు.
తాజావార్తలు
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?