ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. కోట్లాది రూపాయల విలువైన భూముల్ని టీఆర్ఎస్ కొల్లగొడుతోందని, కేసీఆర్ చెప్పినట్టు ‘ధరణి’ సర్వరోగ నివారిణి కాదని అన్నారు. ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ అధ్యయనం చేసిందని, ముందే చెప్పినట్టు అందులో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే భూకబ్జాకు పాల్పడుతోందని.. ప్రాజెక్టులు, ఫార్మాసిటీల పేరుతో భూ సమస్యల్ని సృష్టిస్తోందని ఆరోపించారు. భూముల్ని రైతులు కన్న బిడ్డల కంటే ప్రేమగా చూసుకుంటారని, అలాంటి…
ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కొనసాగుతోన్న కాంగ్రెస్ పార్టీ ధరణి రచ్చబండ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. భూముల విలువ పెంపకం పేరుతో దందాలు జరుగుతున్నాయని చెప్పిన ఆమె.. దున్నేవాడికి కేసీఆర్ భూమి లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం అడ్డగోలుగా భూముల్ని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎక్కడ భూములున్నా లాక్కుంటున్నారని విమర్శించారు. అటు.. ఫారెస్ట్ అధికారులు కూడా భూములు లాక్కుంటూ, పోడు రైతులపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్…
ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీఆర్ఎప్ ప్రభుత్వంపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని, సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలుద్దామంటే, ఆయన సమయం ఇవ్వడం లేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందన రావట్లేదని పేర్కొన్నారు. భూ సమస్యతో రైతులు చనిపోతున్నారని, హత్యలు చోటు చేసుకుంటున్నాయని…