ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధరణి రచ్చబండ కార్యక్రమంలో టీఆర్ఎప్ ప్రభుత్వంపై కిసాన్ కాంగ్రెస్ జాతీయ వైస్ ప్రెసిడెంట్ కోదండరెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోతున్నాయని, సీఎస్ సోమేశ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ను కలుద్దామంటే, ఆయన సమయం ఇవ్వడం లేదని, ఎన్ని లేఖలు రాసినా స్పందన రావట్లేదని పేర్కొన్నారు. భూ సమస్యతో రైతులు చనిపోతున్నారని, హత్యలు చోటు చేసుకుంటున్నాయని…