Marathan Runner : పారిస్ ఒలింపిక్ క్రీడాకారిణి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ప్రియుడు.. చికిత్స పొందుతూ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Marathan Runner : పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఉగాండా క్రీడాకారిణి రెబెక్కా చెప్టెగీ గురువారం విషాదకరంగా మరణించింది. రెబెక్కా ప్రియుడు ఆమెపై పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. దాని కారణంగా ఆమె శరీరం 75 శాతానికి పైగా కాలిపోయింది. రెబెక్కా పరిస్థితి విషమంగా ఉండటంతో కెన్యాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. రెబెక్కా చెప్టెగై 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 44వ ర్యాంక్‌తో పాటు పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ ఆమె మాజీ ప్రియుడు ఆమె కలలను నాశనం చేశాడు. రెబెక్కా చెప్టేగై హత్య కారణంగా ఉగాండాలో శోకం అలముకుంది. ఆమె మాజీ ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెబెక్కా మరణం పట్ల ఆమె కుటుంబం, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు న్యాయం జరగాలని కోరుతున్నారు.
Read Also;Astrology: సెప్టెంబర్ 06, శుక్రవారం దినఫలాలు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
We have learnt of the sad passing on of our Olympic athlete Rebecca Cheptegei OLY following a vicious attack by her boyfriend. May her gentle soul rest in peace and we strongly condemn violence against women. This was a cowardly and senseless act that has led to the loss of a… pic.twitter.com/V8Mog3oMOX
— Donald Rukare (@drukare) September 5, 2024
ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఏం చెప్పారు?
ఈ సంఘటనపై, ఉగాండా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు డొనాల్డ్ రుకారే సోషల్ మీడియాలో రాశారు. మన ఒలింపిక్ అథ్లెట్ రెబెక్కా చెప్టేగై ఇక లేరు అనే బాధాకరమైన వార్త మాకు అందింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని అన్నారు.
ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాదం
భూమి విషయంలో క్రీడాకారిణికి, ఆమె మాజీ ప్రియుడికి మధ్య వివాదం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. చెప్టేగై తండ్రి జోసెఫ్ తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెబెక్కా 14వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో, 2022 సంవత్సరంలో ఆమె థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ మౌంటైన్, ట్రైల్ రన్నింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకున్నారు.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!