KCR and Governor wished Dussehra: దసరా పండుగ సందర్భంగా ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి సందర్భంగా గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నవరాత్రి పండుగ మనలో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయం సాధించడమే దసరా ప్రధాన సందేశమని, అది ఎప్పటికీ వర్తిస్తుందని చెబుతారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలని కోరుకున్నారు గవర్నర్.
Read also: Bus Accident: నదిలో పడ్డ పెళ్లి బస్సు.. 25 మంది మృతి
తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతి పథంలో నడవాలని విజయానికి సంకేతమైన దసరా రోజున చేపట్టిన పనులన్నీ సత్ఫలితాలనివ్వాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. ధర్మానికి ప్రతీకగా, విజయాన్ని అందించే విజయదశమిగా దేశవ్యాప్తంగా దసరా జరుపుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. పాలపిట్టను దర్శించుకుని పవిత్రమైన జమ్మిచెట్టును పూజించే సంప్రదాయం గొప్పదని చెబుతారు. అలా బలయ్ తీసుకుని ప్రేమను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకమని సీఎం కేసీఆర్ అన్నారు. అనతి కాలంలోనే అభివృద్ధి సాధించి రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిన తెలంగాణ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని వివరించారు… విజయదశమి స్ఫూర్తిని కొనసాగిస్తామన్న కేసీఆర్, ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.
Russia-Ukraine war: పుతిన్ పిలుపుతో సైన్యంలో చేరిన రష్యా పౌరులు