Russia-Ukraine war: పుతిన్ పిలుపుతో సైన్యంలో చేరిన రష్యా పౌరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు ఆరునెలల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. యుద్ధంలో గెలవాలన్న కసితో ఏ దేశం కూడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేసేందుకు కావాల్సిన సైన్యాన్ని పటిష్ఠం చేసుకునే పనిలో పడింది. ఇందుకు భారీగా సైనిక సమీకరణకు దిగింది. పుతిన్ సైనిక దళంలో చేరాలంటూ రష్యా పౌరులకు ఆదేశాలు సైతం జారీ చేశారు. నిర్బంధ సైనిక సమీకరణ చేయడానికి ఆ దేశాధికారులు దిగారు. కేవలం గతంలో సైనిక శిక్షణ తీసుకున్న వారే కాకుండా పౌరులు కూడా రష్యా ఆర్మిలో చేరాలంటూ పుతిన్ ప్రజలను కోరారు. ఈ మేరకు దేశ వ్యాప్తంగా రెండు లక్షల మంది ఆర్మీలో చేరినట్టు రష్యా రక్షణ మంత్రి సెర్గేయే షోయిగు ఇటీవల తెలిపారు.
రష్యాకు సైనిక సమీకరణ తిప్పలు తప్పడం లేదు! పుతిన్ ప్రకటన మొదలు ఇప్పటికే వేలమంది రష్యాను వీడగా.. ఇక్కడున్న వారిలోనూ అర్హుల ఎంపిక కష్టతరమవుతోంది. తాజాగా ఇక్కడి ఖబరోవ్స్క్ ప్రాంతం నుంచి సైన్యంలో చేరేందుకు పిలుపు వచ్చిన వేలమందిని అధికారులు వెనక్కు పంపారు. కారణం.. వారు ఆర్మీ కనీస ప్రమాణాలు అందుకోకపోవడమే. ఈ క్రమంలోనే స్థానిక మిలిటరీ కమిషనర్‌ను తొలగించడం గమనార్హం. ‘ఖబరోవ్స్క్ మిలిటరీ కమిషనర్ యూరి లైకో సస్పెండ్ అయ్యారు. అయితే, సైనిక సమీకరణ ప్రక్రియపై ఇది ఎలాంటి ప్రభావం చూపబోదు’ అని గవర్నర్ మిఖాయిల్ డెగ్తియారోవ్ సోమవారం వెల్లడించారు.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
Read Also: Uttarakhand Bus Accident:ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ పెళ్లి బస్సు.. 25 మృతి
ఉక్రెయిన్ తో యుద్ధంలో రష్యా కూడా భారీగానే సైనికులను కోల్పోతోంది. దీంతో దాదాపు 3లక్షల మంది సైనిక బలగాన్ని సమకూర్చుకునేందుకు ఆ దేశం ప్రయత్నిస్తుంది. వీరందరినీ బృందాలుగా విభజించి 80ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీనికోసం ఏకంగా 6శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరో వైపు నిర్బంధ సైనిక సమీకరణపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొందరు దేశం విడిచి పారిపోతున్నారు. రెండు వారాల కాలంలో రెండు లక్షల మంది రష్యా పౌరులు సరిహద్దులు దాటి తమ దేశంలో ప్రవేశించినట్లు ఖజకిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. మరో వైపు రష్యా ఆ దేశానికి చెందిన రైతులను కూడా సైన్యంలో భాగం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?