జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. Also Read:Renu Desai…
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత మూడు సెట్ల…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలులో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈరోజు ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారుల సమాచారం.
Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు పేర్లను షార్ట్‌లిస్ట్ చేసిన పార్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతను అభ్యర్థిగా ఎంపిక చేయాలని ఢిల్లీ పెద్దల నుంచి సూచనలు వచ్చినట్లు సమాచారం. దీనితో ఆ దిశగా ఆలోచించాలని రాష్ట్ర నేతలకు ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థి పేరుపై సస్పెన్స్ మరింత పెరిగింది. ప్రస్తుతం దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, డాక్టర్…
‘మనసానమః’ ఆస్కార్‌కు అర్హత సాధించిన మొట్టమొదటి తెలుగు చిత్రం. ఈ చిత్రం ఇప్పుడు అకాడమీ సభ్యుల ఓటింగ్ కోసం ప్రదర్శితం అవుతోంది. నూతన దర్శకుడు దీపక్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ 2020లో విడుదలైంది. అప్పటి నుండి 950+ అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుంది. 300+ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శితం అయ్యింది. ఆస్కార్ బరిలో నిలిచిన ఈ చిత్రం గురించి మేకర్స్ స్పందిస్తూ “ఆస్కార్ కోసం పోటీ పడుతున్న సినిమాల్లో ‘మనసానమః’ ఉండడం గర్వకారణం. ఈ…