Jubilee Hills Bypoll Counting : రేపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ కోసం యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనే ఉత్కంఠకు తెరపడనుంది. రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల ఓట్ల లెక్కింపు కోసం యూసుఫ్ గూడ లోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి…
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ మందకోడిగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటికీ, ఓటర్లు మొదటి రెండు గంటలు.. అంటే ఉదయం 9 గంటల వరకు.. మాత్రమే కొంత ఉత్సాహంగా వచ్చి 10% ఓటింగ్ నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ శాతం క్రమంగా నెమ్మదించింది. సాయంత్రం 3 గంటల సమయానికి కేవలం 40.2% మాత్రమే ఓటింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మందకొడిగా ఉండటానికి ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, ఇది ఉప…
Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నాన్ లోకల్స్ ఉండటంపై సీఈఓ సుదర్శన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నియోజక వర్గంలో ఉన్న నాన్ లోకల్స్ పై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ అభ్యర్థికి రాకపోతే.. తాను చెప్పింది చేయడానికి కిషన్ రెడ్డి సిద్ధమా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్‌ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది. ఈ ఎన్నికలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. అనంతరం జరిగిన స్క్రూటినీ ప్రక్రియలో 186 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థుల నామినేషన్లు చెల్లని వాటిగా తేలాయి. బుధవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన తర్వాత 81 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. అయితే, శుక్రవారం 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో చివరికి…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. Also Read:Renu Desai…
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ తెలిపారు. చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత మూడు సెట్ల…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలులో ఉత్సాహం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. ఈరోజు ఒక్కరోజే 31 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారుల సమాచారం.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల సన్నాహకాలు మొదలయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి.