ప్రపంచవ్యాప్తంగా అఖండ విజయాన్ని సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కూడా అంతకుమించిన కలెక్షన్స్ సాధించాయి. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన రిషబ్ శెట్టి ఇందులో హీరోగా నటించడమే కాకుండా, ద్విపాత్రాభినయం కూడా చేశారని మనకి తెలుసు. అయితే తాజాగా ఆ ముసలి వ్యక్తి పాత్ర కూడా రిషబ్ శెట్టే పోషించారని సమాచారం. నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించడంతో పాటు, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వర్తించారు. గతేడాది విడుదలైన ‘కాంతార’ చిత్రంలో శివ మరియు అతని తండ్రి అనే రెండు పాత్రలలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన రిషబ్ శెట్టి, ఈ ప్రీక్వెల్‌లో కూడా శివ, బెర్మే సహా మాయకర అనే రెండు భిన్నమైన పాత్రలలో నటించినట్టు తెలుస్తోంది.
Dude : డ్యూడ్ సినిమాలో మెరిసిన వివాదాస్పద హీరోయిన్.. ఎవరంటే?
కాంతారలో ఇప్పటికే రెండు పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన రిషబ్ శెట్టి, చాప్టర్ 1 సినిమాలో ఒక కీలకమైన ముసలి వ్యక్తి మాయకర పాత్రను కూడా పోషించినట్టు తెలిసింది. ఆ ముసలి వ్యక్తి పాత్రే కథానాయకుడైన బెర్మేకు మార్గదర్శిగా ఉంటుంది. ఈ పాత్రలో రిషబ్ శెట్టి అద్భుతమైన నటన, ఆయన బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం అని సినీ వర్గాలు చెబుతున్నాయి. తనలోని నటుడిని, దర్శకుడిని బ్యాలెన్స్ చేస్తూ, ఇంత వైవిధ్యమైన పాత్రలను పోషించడం రిషబ్ శెట్టి నిబద్ధతకు నిదర్శనం.