జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మహదేవపూర్ మండలంలోని ఏన్కపల్లి అడవుల నుంచి ప్రతాపగిరి అడవుల వైపు పెద్దపులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు ఆనవాళ్లు కనిపించగా పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆడవులను జల్లెడ పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Donald Trump: “మళ్లీ ఆఫ్ఘనిస్థాన్ వెళ్లబోతున్న అమెరికా”.. చైనా కారణమని ట్రంప్ వ్యాఖ్యలు..
పులి సంచారానికి సంబంధించి పలు చోట్ల పాదముద్రలు (పగ్ మార్క్స్) కనిపించాయి. దీంతో ప్రతాపగిరి అడవుల చుట్టు ఉన్న గ్రామాల ప్రజలు, ఇతరులు అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గత 18 రోజులుగా కాటారం, మహదేవపూర్, పలిమెల మండలాల్లోని అడవుల్లో పెద్దపులి తిరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు.
ఇది కూడా చదవండి: SLBC Tragedy: టెన్నెల్ దగ్గరకు చేరుకున్న ఉస్మానియా వైద్య బృందం