జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో పెద్దపులి సంచారం మళ్లీ కలవర పెడుతుంది. పల్గుల గ్రామ శివారు అడవిలో పులి పాదముద్రలు, సేదతీరినా ఆనవాళ్లను స్థానికులు గుర్తించారు. కాగా.. పులి సంచారంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. మహదేవపూర్ మండలంలోని ఏన్కపల్లి అడవుల నుంచి ప్రతాపగిరి అడవుల వైపు పెద్దపులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తూరుపల్లి అడవుల్లో పెద్దపులి సంచారం కలకలం రేపింది. మహదేవ పూర్ రేంజ్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. పలుచోట్ల పెద్దపులి అడుగులు కనిపించడంతో ప్రజలు భయాందోళనల వ్యక్తం చేస్తున్నారు. నస్తూరుపల్లి గ్రామానికి చెందిన వెంకటి అనే వ్యక్తి తన పశువుల కోసం అడవిలోకి వెళ్లి వస్తుండగా.. మహదేవపూర్ దిశగా వెళ్తున్న పెద్దపులి కనిపించిందని స్థానికులు అంటున్నారు. మహదేవపూర్ పరిసరాల్లో పెద్దపులి కనిపించిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం…
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ మండలం గొంది గ్రామ సమీపంలో గత కొన్ని రోజులుగా పులి తన పిల్లలతో సంచరించడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పులి తన పిల్లలతో కలిసి అటవీ అంచు గ్రామ సమీపంలోని కాలువ ఒడ్డును తన ఆశ్రయంగా మార్చుకుని చుట్టుపక్కల తిరుగుతూ రైతులను , నివాసితులను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. పులుల సంచారంతో పొలం పనులు చేపట్టేందుకు భయపడుతున్నామని పేర్కొన్నారు. పులులను అడవుల్లోకి మళ్లించి మనుషులు, పశువులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని…
ఒక్క పులి.. అధికార యంత్రాంగాన్ని, సమీప గ్రామాల ప్రజల్ని కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. కాకినాడ జిల్లాలో 12 రోజులుగా పెద్ద పులి సంచారంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పులి దాడికి గేదెలు, ఆవులు, ఇతర జంతువులు గాయాల పాలవుతున్నాయి. మరికొన్ని చనిపోతూ యజమానులకు తీరని నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా పొదురుపాక వద్ద ఆవుని చంపిన పులి.. గురువారం రాత్రి శరభవరం వద్ద రెండు గేదెలపై దాడి చేసింది. పులి దాడి నుంచి గేదెలు గాయాలతో తప్పించుకున్నాయి. పులి…