Donald Trump: డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొదటి రోజే పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను పాస్ చేశారు. అక్రమ వలసదారుల బహిష్కరణ, బర్త్ రైట్ పౌరసత్వం వంటి వాటిపై ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా, మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నవారు. అమెరికా చరిత్రలో తొలిసారిగా ఇంగ్లీష్‌ని అధికార భాషగా చేస్తూ, డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేయనున్నట్లు వైట్ హౌజ్ అధికారి శుక్రవారం తెలిపారు.
Read Also: Bihar Elections: నితీష్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికలు.. బీజేపీకి 100, జేడీయూకి 90 సీట్లు..
అమెరికా సమాఖ్య వ్యవస్థలో ఎప్పుడూ అధికార భాష లేదు. కానీ కొన్ని అమెరికన్ రాష్ట్రాలు మాత్రం అధికార భాషల్ని కలిగి ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన మొదటి అధ్యక్ష ఎన్నికల ప్రచారం సమయంలో, తన ప్రత్యర్థి బెజ్ బుష్ వేరే భాషలో మాట్లాడినందుకు మందలించారు. 2015లో న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో ‘‘మనది ఇంగ్లీష్ మాట్లాడే దేశం’’ అని అన్నారు. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 32 రాష్ట్రాలు ఇంగ్లీష్‌ని తమ అధికార భాషగా స్వీకరించాయి. టెక్సాస్ వంటి కొన్ని రాష్ట్రాల్లో భాషపై సమస్య ఉంది. టెక్సాస్‌లో స్పానిష్ మాట్లాడే వారు ఎక్కువగా ఉంటారు.