జగిత్యాల జిల్లాలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. పదవ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసైన విషయం విస్మయానికి గురి చేస్తుంది. జగిత్యాలలో విద్యార్థినులు గంజాయి మత్తులో చిత్తు అవుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులు అధిక మొత్తంలో గంజాయికి బానిస అయ్యారు. ఈ విషయాన్ని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
BJP: బీజేపీ నాల్గో జాబితా విడుదల
విద్యార్థినులు రోజూ గంజాయి సేవిస్తూ.. మత్తులో తేలిపోతున్నారు. అంతేకాకుండా.. గంజాయికి అలవాటు పడి వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాలన్నీ శిశు సంరక్షణ కమిటీ బయటపడ్డాయి. బాలికలకు గంజాయి తరలింపు వెనుక సెక్స్ రాకెట్ ముఠా బయటపడింది. గంజాయితో పాటు బాలికలను హైదరాబాద్ లో రేవ్ పార్టీలకు తరలిస్తున్నారు ముఠా. అంతేకాకుండా.. ప్రతి పార్టీకి ముప్పై వేలు చెల్లిస్తున్నట్లుగా తెలుస్తోంది.
Radhika: బీజేపీ ఎంపీగా రాధిక.. అక్కడి నుంచే పోటీ
విచారణలో భాగంగా.. 20 మంది బాలికలు గంజాయికి బానిస అయినట్టు సమాచారం. ఈ క్రమంలో.. నార్కోటిక్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. సూత్రధారులేవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. సెక్స్ రాకెట్ ముఠాపై దర్యాప్తు లోతుగా కొనసాగుతుంది. మత్తుకు అలవాటైన విద్యార్థినిలను స్వధార్ హోంకు తరలించారు అధికారులు.