BJP: బీజేపీ నాల్గో జాబితా విడుదల.. సీనియర్ నటి రాధిక ఎక్కడి నుంచంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాల్గో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 15 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులను బీజేపీ వెల్లడించింది.
పుదుచ్చేరీలో ఒకటి, తమిళనాడులోని 14 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. ప్రముఖ సినీనటి రాధికా శరత్ కుమార్ విరుధునగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆమె భర్త ఆర్.శరత్ కుమార్ తన పార్టీ ఆల్ ఇండియా సమతువ మక్కల్ కట్చిని బీజేపీలో విలీనం చేశారు. పుదుచ్చేరీ లోక్‌సభ స్థానం నుంచి నమశ్శివాయం బరిలోకి దిగుతున్నారు.
Also Read
- Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
- Kriti Sanon: రాహుల్‌గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు

మొత్తం నాలుగు జాబితాల్లో 291 మంది అభ్యర్థులను కమలనాథులు ప్రకటించారు. తొలి జాబితాలో 195 మంది, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9 మంది, నాల్గో జాబితాలో 15 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఫస్ట్ ఫేజ్‌లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఇక చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. తొలి విడతలో ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
తమిళనాడు అభ్యర్థులు వీరే..
విరుధునగర్-రాధికా శరత్ కుమార్
మదురై-రామ శ్రీనివాసన్
చిదంబరం – పి. కాత్యాయని
తిరువళ్లూరు-పొన్. వి.బాలగణపతి
చెన్నై నార్త్-ఆర్.సి. పాల్ కనగరాజ్
తిరువన్నామలై-ఎ. అశ్వత్థామన్
నమక్కల్- కె.పి. రామలింగం
తిరుప్పూర్- ఎ.పి. మురుగనందం
పొల్లాచ్చి-కె. వసంతరాజన్
కరూర్-వి.వి. సెంథిల్నాథన్
నాగపట్టిణం – ఎస్జీఎం రమేశ్
తంజావూరు-ఎం. మురుగనందం
శివలింగ-దేవనాథన్ యాదవ్
తెన్‌కాశీ – జాన్ పాండియన్

తాజావార్తలు
-
Silver Cleaning Trick: వెండి ఆభరణాలపై నలుపు పోవాలా? ఇలా క్లీన్ చేస్తే కొత్తదానిలా మెరిసిపోతాయి!
-
Marriage Not License: తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేందుకు భర్త పర్మిషన్ అక్కర్లేదు.. హైకోర్టు కీలక తీర్పు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్‌తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Konaseema Fishermen: 23 రోజుల తర్వాత శుభవార్త.. గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు క్షేమం
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..