జగిత్యాల జిల్లాలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. పదవ తరగతి విద్యార్థినులు గంజాయికి బానిసైన విషయం విస్మయానికి గురి చేస్తుంది. జగిత్యాలలో విద్యార్థినులు గంజాయి మత్తులో చిత్తు అవుతున్నారు. తమ బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పదవ తరగతి చదివే విద్యార్థులు అధిక మొత్తంలో గంజాయికి బానిస అయ్యారు. ఈ విషయాన్ని ఓ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.