ఎవరైనా లా అండ్ ఆర్డర్ ను తప్పించేలా పని చేస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నాను అని సీఎం రేవంత్ తెలిపారు. ఇక, హైదరాబాద్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. అందులో భాగంగా మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టాం.. దేశానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నాం.