IND vs ENG: ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ 2025లో భాగంగా బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ సాక్రె ను సాధించిన విషయం తెలిసిందే. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులు చేయగా, దానికి సమాధానంగా ఇంగ్లాండ్ 3వ రోజు లంచ్ సమయానికి 5 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. దీనితో ఇంగ్లాండ్ ఇంకా 338 పరుగుల వెనుకబడి ఉంది.
Read Also:Allagadda: విషాదం.. స్కూల్ బస్సు కింద పడి 4 ఏళ్ల చిన్నారి మృతి
భారత బ్యాటింగ్‌ను కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అద్భుత డబుల్ సెంచరీతో భారీ స్కోర్ ను అందించాడు. అతనికి తోడుగా యశస్వి జైస్వాల్ (87), రవీంద్ర జడేజా (89), వాషింగ్టన్ సుందర్ (42) పరుగులు చేశారు. మొత్తం 151 ఓవర్లలో 587 పరుగులకు భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లాండ్ బౌలింగ్‌లో శోయబ్ బషీర్ 3, జోష్ టంగ్, వోక్స్ 2 వికెట్లు తీశారు. ఇక ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అత్యంత దారుణంగా మొదలైంది. టాప్ ఆర్డర్‌లో డకెట్ (0), పోప్ (0) పరుగులు లేకుండానే వెనుదిరిగారు. నేడు కెప్టెన్ స్టోక్స్ కూడా పరుగులు ఎం చేయకుండానే వెనుతిరిగాడు. ఇండియా బౌలింగ్ లో సిరాజ్ 3, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీశారు.
Read Also:JNTU-H: JNTU హైదరాబాద్ బోర్డు ఆఫ్ స్టడీస్ సమావేశం.. R25 నిబంధనలపై కీలక నిర్ణయాలు..!
ఓ దశలో ఇంగ్లాండ్ 84/5 స్కోరులో ఉండగా.. ఆ తర్వాత హ్యారీ బ్రుక్ (91 నాటౌట్), జేమీ స్మిత్ (102 నాటౌట్) మెరుపులు మెరిపించారు. వీరిద్దరి మధ్య 165 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొంది. మూడోరోజు మొదటి సెషన్ లోనే ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి ఏకంగా 172 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్స్ ‘బజ్ బాల్’ తరహాలో ఇన్నింగ్స్ ను ఆడుతున్నారు.