తల్లి పాలు బిడ్డకు అమృతంతో సమానం అనేక పోషకాలు ఉన్న తల్లి పాలు.. పసిపిల్లలను అనేక ఆరోగ్య సమస్యలను నుంచి రక్షిస్తాయి. తల్లిపాలు తాగడం వల్ల పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదుగుతారు. అయితే, టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే తల్లులు.. పిల్లలకు పాలిస్తే వారి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లలను తల్లి పాలు ఎలా ప్రభావితం చేస్తాయని భయపడుతూ ఉంటారు.. అయితే ఈ విషయం పై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉంటే.. పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. శిశువుకు సమర్థవంతంగా పాలివ్వడం కష్టమవుతుంది. దీని కారణంగా బిడ్డకు సరైన పోషకాలు అందవు, చిన్నారి అధికంగా బరువు పెరిగే అవకాశం ఉంది… తల్లికి షుగర్ కంట్రోల్లో లేకుండా ఉంటే ఆ సమయంలో బిడ్డకు పాలివ్వడం అంత మంచిది కాదని, ఎన్నో ప్రమాదకర వ్యాదులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నాయి.. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఇన్సులిన్, ప్లాసెంటా గుండా వెళుతుంది.. ఇది మరింత ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి చిన్నారి క్లోమగ్రంధిని ప్రేరేపించగలదు. చిన్నారిలో ఇన్సులిన్‌ను అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంటే.. తల్లిపాలు ఇవ్వడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా వరకు పడిపోతాయి..
ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఇన్సులిన్ వాడుతుంటారు. డెలివరీ తర్వాత.. ఓరల్ హైపోగ్లైసీమిక్ ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. ఫస్ట్ జనరేషన్ సల్ఫోనిలురియాస్, టోల్బుటమైడ్, క్లోర్‌ప్రోపమైడ్ తల్లి పాలలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు.. ఎప్పటికప్పుడు షుగర్ ను టేస్ట్ చేసుకోవాలి.. సమతుల ఆహారం, వ్యాయామం రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచడానికి సహాయపడతాయి.డయాబెటిస్ కంట్రోల్‌లో లేకుండా.. బిడ్డకు పాలివ్వడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా బిడ్డ ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు.. అందుకే బిడ్డకు పాలిచ్చే తల్లులు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని పాలివ్వడం మంచిది..