Maamannan Releasing In Telugu As Nayakudu On July 14th: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కి తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘మామన్నన్’ తెలుగులో ‘నాయకుడు’గా రిలీజ్ అవనుంది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ & సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా జూలై 14న విడుదల చేసేందుకు సర్వం సిద్ధం అవుతోంది. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం మామన్నన్ లో ఉదయనిధి స్టాలిన్, వడివేలు మరియు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించారు. మామన్నన్ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో తమిళంలో దూసుకుపోతున్న క్రమంలో దర్శకుడు హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ గా రికార్డులకు ఎక్కనున్నారు.
Threads App: థ్రెడ్ యాప్ లాంచింగ్.. ఫీచర్లు ఏమిటి? ఎలా ఉపయోగించాలి?
ఇక తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్ తెలుగు హక్కులను సొంతం చేసుకుని ‘నాయకుడు’ అనే టైటిల్‌తో జూలై 14న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విడుదల చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఇక తెలుగు రిలీజ్ డేట్ పోస్టర్ లో వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్‌ల ముఖాల్లో ఇంటెన్సిటీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఉదయనిధి పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని చేపట్టే ముందు నటుడిగా చేసిన చివరి చిత్రం కావడం మరో విశేషం. ఇక సినిమా టెక్నికల్ టీంలో ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్, సినిమాటోగ్రాఫర్ తేని ఈశ్వర్, ఎడిటర్ సెల్వ ఉండగా రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ సినిమాను నిర్మనిచ్చింది. తెలుగు సాహిత్యం చంద్రబోస్, రాకేందు మౌళి అందించగా ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు.