Gurukul School: రెండు రోజుల్లోనే ఒకే జిల్లాలో ఇద్దరు విద్యార్థినులు పాముకాటుకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మినీ గురుకల పాఠశాలలో విద్యార్థిని పాము కాటుకు గురైంది. బుధవారం పాఠశాల వరండాలో కూర్చున్న నాలుగో తరగతి విద్యార్థిని నికితను పాము కాటు వేసింది. చిన్నారి భయంతో కేకలు వేయడంతో.. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చిన్నారికి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.చిన్నారిని కాటు వేసిన పామును పాఠశాల సిబ్బంది చంపగా, గురుకుల ప్రాంగణంలో మరో నాలుగు పాములు ప్రత్యక్షమయ్యాయి. వీరిలో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోగా మిగిలిన ఇద్దరిని గ్రామస్థులు హతమార్చారు.
Read also: Etala Rajender: ప్రజల కష్టాలను తీర్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది
నిజామాబాద్ జిల్లాలో రెండు రోజుల కిందటే ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పొతంగల్ మండలం జల్లపల్లి ప్రభుత్వ పాఠశాలలో నందిని అనే బాలిక మృతి చెందింది. కిటికీలోంచి పుస్తకం పడిపోవడంతో దాన్ని తీయడానికి వెనుకకు వెళ్లిన విద్యార్థిని పాము కాటుకు గురైంది. ప్రస్తుతం ఇద్దరు విద్యార్థినులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పాముల బెడదతో పాఠశాల, గురుకుల పాఠశాల విద్యార్థులు భయంతో వణికిపోతున్నారు. పాఠశాల ఆవరణలో ఏ క్షణంలో పాములు వచ్చి కాటేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. విద్యార్థిని పాము కాటుకు గురికావడంపై చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పాఠశాలలు, గురుకులాల ఆవరణలు పిచ్చి మొక్కలతో అపరిశుభ్రంగా ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
Etala Rajender: బీజేపీ నేతలు కలిసికట్టుగా ఉన్నాం.. కలిసే పనిచేస్తాం, విజయం సాధిస్తాం