Rythu Bharosa: తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేసింది. ఈ రోజు 1,551.89 కోట్ల రూపాయలను విడుదల అయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ రోజు (జూన్ 17న) 3 ఎకరాల వరకు భూమిని కలిగి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేయడం జరిగిందని వెల్లడించారు.
Read Also: Ahmedabad Plane Crash: విమానం కూలగానే బాల్కనీ నుంచి దూకేసిన మెడికోలు.. వెలుగులోకి వీడియోలు
అయితే, అందుకోసం 1551.89 కోట్ల రూపాయలను విడుదల చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశాం అన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ప్రకటించారు.