అహ్మదాబాద్ విమాన ప్రమాద దృశ్యాలు ఇంకా కళ్ల ముందే మెదులుతున్నాయి. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానం.. టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి సమీపంలోని బీజే మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలిపోయింది. దీంతో వెంటనే మంటలు అందుకున్నాయి. అప్రమత్తమైన ఎంబీబీఎస్ విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు మూడంతస్థుల బిల్డింగ్ పైనుంచి దూకేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఓ వైపు మంటలు చెలరేగుతుండగా.. ఇంకోవైపు బెడ్‌షీట్‌ల ద్వారా కిందకు దూకేందుకు ప్రయత్నించారు. అలా చాలా మంది ప్రాణాలు కాపాడుకున్నారు.
ఇది కూడా చదవండి: Ashu Reddy : అషురెడ్డి అందాల విందు.. చూసేందుకు భలే కనివిందు
జూన్ 12న మధ్యాహ్నం 1:43 నిమిషాలకు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఎయిరిండియా విమానం 242 మంది ప్రయాణికులతో లండన్‌కు బయల్దేరింది. అలా టేకాఫ్ అయిందో.. లేదో కొన్ని సెకన్లకే సమీపంలో కూలిపోయింది. ఒక ప్రయాణికుడి తప్ప.. 241 మంది ప్రయాణికులు చనిపోయారు. ఇక హాస్టల్‌పై కూలడంతో దాదాపు 30కు పైగా మెడికోలు దుర్మరణం చెందారు.
ఇది కూడా చదవండి: Iran-Israel War: ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులు తరలింపు
ఇక విమానం కూలిపోగానే సమీపంలోనే అన్ని హాస్టల్‌లోని విద్యార్థులు ప్రాణాలు రక్షించుకునేందుకు బాల్కనీ నుంచి కిందకు దూకేశారు. రెయిలింగ్‌కి బెడ్‌షీట్లు తగిలించుకుని కిందకు దిగేశారు. ప్రస్తుతం వీడియోలు వైరల్ అవుతున్నాయి. విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు.