హైదరాబాద్ నగరంలో మరోసారి వ్యభిచారం ముఠా గుట్టు రట్టు అయింది. పైనాన్షియల్ డిస్ట్రిక్ పరిధిలో గల గౌలిదొడ్డిలోని రెండు అపార్ట్మెంట్లో ఎస్ఓటి పోలీసులు ఆకస్మికంగా సోదాలు చేశారు. ఈ దాడుల్లో విదేశీ యువతను ట్రాప్ చేసి వ్యభిచారం చేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలోనే.. మరో 9 మంది ఆఫ్రికా యువతులను పోలీసులు రెస్క్యూజ్ చేశారు. ఉపాధి పేరుతో ఆఫ్రికన్ యువతులను హైదరాబాద్ రప్పించి బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు ముఠా సభ్యులు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సభ్యుల ముఠాని పట్టుకున్న పోలీసులు.. వారిని రిమాండ్ కు తరలించారు. ఈ ముఠా సభ్యులు ఆన్లైన్ ద్వారా విట్టులను ఆకర్షించి వ్యభిచారం చేస్తున్నారు. ఇక, ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. విచారణ కొనసాగిస్తున్నారు.